మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కామెడీ ట్వీట్స్, పంచ్ డైలాగ్స్ వేస్తూనే ఉంటాడు. ఇక తాజాగా మరోసారి ఆయన తన ట్విట్టర్ ద్వారా 2020 పై కామెడీ ట్వీట్ చేసాడు. నిజానికి కరోనా వల్ల సినీ పరిశ్రమకు బాగానే నష్టం వచ్చింది. దురదృష్టకరమైన అంశం ఏంటంటే షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరు షూట్ కు వెళ్ళడానికి రెడీ గా లేకపోవడం. ఎప్పుడెప్పుడు అనుమతులు ఇస్తారా అని అనుమతులు కోసం వెయిట్ చేసిన వాళ్ళే ఇప్పుడు లేట్ అయినా ప్రాబ్లెమ్ లేదు చిన్నగానే షూట్ ను మొదలుపెడదాం అనే నిర్ణయానికి వచ్చేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్.. తాజాగా తను తీసుకున్న ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ.. నేను తీసుకున్న ఫొటో కొంచెం మబ్బుగా.. బ్లర్ అయింది.. 2020 లో ప్లాన్స్ లానే ఉందని నా ఫొటో ఉంది అన్నట్టు ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక ఫొటోకి నెటిజన్స్ కూడా కామెడీగానే రిప్లై ఇస్తున్నారు.
ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























