ముగ్గురు డైరెక్టర్స్ తో వరుణ్ సినిమా ఏంటబ్బా అనుకుంటున్నారా..? అవును ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ఇదే. అసలు సంగతేంటంటే.. వరుణ్ సినిమా కోసం ముగ్గురు డైరెక్టర్స్ పనిచేస్తున్నారట. వాళ్ళు ఎవరో కాదు.. క్రిష్, సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీ. అంటే ముగ్గురు కలిసి డైరెక్ట్ చేస్తున్నారా అంటే పప్పులో కాలేసినట్టే. ఈ సినిమాకు క్రిష్ కథను అందిస్తూనే నిర్మిస్తున్నాడట. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ట్నైమెంట్స్ బ్యానర్ పై క్రిష్మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నాడట.
ఇక దర్శకత్వ బాధ్యతలు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ స్క్రీన్ ప్లే అందించనున్నాడట. ఇక వరుణ్ వరుణ్ వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తనకు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్క్క్రిప్టు వర్క్ పనుల్లో ఉన్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి చూద్దాం ఇందులో ఎంత వరకూ నిజముందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు.యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: