
మెగా స్టార్ చిరంజీవి అంటే ఎందరికో స్ఫూర్తి. అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగి మెగా స్టార్ అంతటి స్థాయికి ఎదిగాడంటే మాములు విషయం కాదు. అందుకే ఆయన్ను ఎంతో మంది హీరోలు స్ఫూర్తి గా తీసుకుంటారు. ఇక మెగాస్టార్ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు గా వచ్చారు. చిరు, పవన్, నాగబాబు, చరణ్, వరుణ్, సాయి తేజ్, నిహారిక, ఇప్పుడు వైష్ణవ్ తేజ్, ఆఖరికి చిరు అల్లుడు కూడా తెలుగు తెరపై సందడి చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చిరు సినిమాల్లో ఇప్పటికే కొన్ని పాటలను రీమిక్స్ చేసి తన సరదా తీర్చుకున్నాడు మెగా అల్లుడు సాయి తేజ్. అంతేకాదు చిరు సినిమాల్లో కొన్ని సినిమాలను కూడా రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ.. ఆచరణలోకి మాత్రం పెట్టింది లేదు. ఇక ఇదే విషయంపై నాగబాబు మాట్లాడుతూ వరుణ్ ఎం సినిమాలు రీమేక్ చేస్తే బావుంటుందో చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి నటించిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలు వరుణ్ తేజ్ రిమేక్ చేయాలని కోరుకుంటున్నారట. ఈ రెండు చిత్రాలు వరుణ్ రిమేక్ చేస్తే చూడలని ఉంది, వరుణ్ కి ఈ పాత్రలు బాగా సెట్ అవుతాయన్నారు నాగబాబు. ఐతే చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ హిట్స్ గా ఉన్న ఆ రెండు చిత్రాలలో నటించడం, వరుణ్ కి పెద్ద సాహసమే అన్నారు. కాగా చిరంజీవి కెరీర్ లో ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఛాలెంజ్ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన సినిమా కాగా, హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన కొదమ సింహంలో చిరంజీవి కౌబాయ్ గా సూపర్ సక్సెస్ అయ్యారు. మరి చూద్దాం ఫ్యూచర్ లో వరుణ్ ఆ సాహసం చేస్తాడేమో..




కాగా ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: