ట్యాగ్ · 32 కథనాలు
వైష్ణవ్ తేజ్ కు మెగా కానుక

100 కోట్ల క్లబ్ లో 'ఉప్పెన'
'ఉప్పెన' టీమ్ కు బన్నీ అభినందనలు
'ఉప్పెన' ఒక క్లాసిక్
డీఎస్పీ, కృతి శెట్టి కి 'మెగా సర్ ప్రైజ్'

21 ఇయర్స్ రికార్డ్ బ్రేక్ చేసిన 'ఉప్పెన'
ఆడియన్స్ లో మార్పు సినిమాలకు మంచిదే
ఉప్పెన మూవీ పబ్లిక్ టాక్
'ఉప్పెన' - ఈ రీజన్స్ చాలు సినిమా చూడటానికి
సెన్సార్ పూర్తి చేసుకున్న ఉప్పెన
'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్
'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
"ఉప్పెన " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
"ఉప్పెన "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఉప్పెన 'టీజర్' రిలీజ్

అవకాశాల "ఉప్పెన "లో కృతి శెట్టి
"ఉప్పెన "మూవీ సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. తమిళ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించిన “ఉప్పెన “మూవీ ఫిబ్రవరి 12 వ తేదీరిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. మెగా స్టార్ చిరంజీవి ” ఉప్పెన ” మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. వరస మూవీస్ తో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో బిజీగా మారారు.
వైష్ణవ్ తేజ్ కు మెగా కానుక
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేయడం విశేషం. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వైష్ణవ్ తేజ్ మూడవ సినిమాకు , 4వ సినిమా కు కమిట్ అయ్యారు.

100 కోట్ల క్లబ్ లో 'ఉప్పెన'
బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింతో తెలుసు కదా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని నిజం చేస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈ డెబ్యూ హీరో ఏ డెబ్యూ హీరోకి రాని కలెక్షన్స్ రాబట్టుకొని కొత్త రికార్డులు సృష్టించాడు. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక తాజాగా ఈసినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'ఓ మంచి…
'ఉప్పెన' టీమ్ కు బన్నీ అభినందనలు
ఈమధ్య మన హీరోలు ఏదైనా సినిమా బాగుంటే సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాపై ప్రశంసలు కురింపించడం చూస్తూనే ఉన్నాం. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకడుగు ముందే ఉంటాడు. చిత్రటీమ్ ను పిలిపించి మరీ వారిని అభినందించడం అల్లు అర్జున్ కు అలవాటు. ఇక ఇప్పుడు తాజాగా ఉప్పెన టీమ్ ను కూడా అభినందించాడు బన్నీ. ఇన్ని రోజులు బన్నీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా హైద్రాబాద్ చేరుకున్న బన్నీకి పుష్ప నిర్మాతలు స్పెషల్ షో వేశారట.
'ఉప్పెన' ఒక క్లాసిక్
విడుదలై వారం రోజులు అవుతున్నా ఇంకా 'ఉప్పెన' సినిమా గురించే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయకుండా పట్టుబట్టి థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ ఆగి.. థియేటర్స్ లోనే ఎందుకు రిలీజ్ చేశారో.. ఈ సినిమాపై అంత నమ్మకంగా ఎలా వున్నారో.. దానికి ఈ సినిమా ఇచ్చిన సక్సెసే నిలువెత్తు నిదర్శనం. ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు అవుతుంది ఇంకా పలు ప్రాంతాల్లో మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది. అంతేకాదు ఎంతోమంది సినీప్రముఖుల ప్రసంశలు అందుకుంటుంది.
డీఎస్పీ, కృతి శెట్టి కి 'మెగా సర్ ప్రైజ్'
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత సంచలనమైన హిట్ కొట్టిందో చూస్తున్నాం. వైష్ణవ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, సాయి చంద్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 12 న రిలీజ్ అయి ఉప్పెనలా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. డెబ్యూ హీరోగా కలెక్షన్స్ పరంగా వైష్ణవ్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విజయంలో వైష్ణవ్, విజయ్ సేతుపతి పాత్ర ఎంత వుందో హీరోయిన్ కృతి శెట్టి, దేవి శ్రీ ప్రసాద్ పాత్ర కూడా అంతే ఉందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి వారికి మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు.

21 ఇయర్స్ రికార్డ్ బ్రేక్ చేసిన 'ఉప్పెన'
గత ఐదు రోజుల నుండి ఎక్కడ విన్నా ఉప్పెన సినిమా టాపిక్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. మొదటి సినిమాతోనే అటు డైరెక్టర్.. ఇటు హీరో హీరోయిన్స్ రేంజ్ మారిపోయింది. అయితే ఏదో లక్ కాదులెండి.. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్ట్ బుచ్చిబాబు కథతో పాటు ముఖ్యంగా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ల నటన, విజయ్ సేతుపతి విలనిజం.. డీఎస్పీ పాటలు ఇలా ప్రతి ఒక్క అంశం కలిసిరావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.
ఆడియన్స్ లో మార్పు సినిమాలకు మంచిదే
ఒకప్పుడు సినిమాలు అంటే ఇలానే ఉండాలి అన్న కొన్ని ఫార్ములాలు ఉండేవి. కొన్ని సినిమాలు సందేశాత్మకంగా వచ్చినా చాలా వరకూ ఒకే ధోరణిలో నడిచేవి. హీరో హీరోయిన్.. ఫైట్స్.. పాటలు..కామెడీ.. ఇవే ఎలిమెంట్స్ తో కొన్ని వేల సినిమాలు వచ్చాయి ఇప్పటి వరకూ. ఇక క్లైమాక్స్ అయితే కొంచం కూడా తేడా ఉండకూడదు. ఏది ఏమైనా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కలవాల్సిందే. లేకపోతే ఆడియన్సే డిజప్పాయింట్ అవుతారని..అలా లేకపోతే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరని దర్శక నిర్మాతలకి భయం. అందుకే పక్క ఇండస్ట్రీ వాళ్లు ఇలాంటి ధైర్యం చేసినా మనవాళ్లు మాత్రం చేయలేకపోయారు.

'ఉప్పెన' సాలిడ్ కలెక్షన్స్ - వైష్ణవ్ న్యూ రికార్డ్
మొదటి సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకునే వాళ్లు మంచి ఫైట్ లు లొకేషన్స్.. ముఖ్యంగా హీరోయిజం ఇలా అన్ని ఎలిమెంట్స్ ను చూసుకుంటారు. అందులో మెగా కాంపౌండ్ నుండి వస్తున్న హీరో.. ఇంకెన్ని అంచనాలు ఉంటాయి. కానీ వాటికి విరుద్ధంగా పాత్ర ప్రధానమైన సినిమా..అది కూడా డీ గ్లామరైజ్డ్ పాత్ర... భారీ అంచనాలు ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా హీరో వైష్ణవ్ తేజ్.. ఆ సినిమా 'ఉప్పెన'. ఇప్పటిదాకా మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఏ కొత్త హీరో కూడా ఇలాంటి సాహసం చేయలేదని చెప్పొచ్చు. భారీ అంచనాలు మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మంచి టాక్ ను మాత్రమే కాదు సాలిడ్ కలెక్షన్స్ కూడా ఈ…

రివ్యూ .. ప్రేమ, సంఘర్షణల 'ఉప్పెన'
ఇక ఈ సినిమాకు మొదటినుండి మరో హైలెట్ ఏంటంటే.. దేవిశ్రీ ప్రాసాద్ సంగీతం. తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. తన బీజీయంతో సినిమాకు ప్రాణం పోశాడు. శ్యామ్ దత్ విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పిన ఈ 'ఉప్పెన' అందరికీ నచ్చుతుంది.
ఉప్పెన మూవీ పబ్లిక్ టాక్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. ఈ రోజు అనగా ఫిబ్రవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందుతుంది. మరి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో కింది వాటిలో వీక్షించగలరు .
'ఉప్పెన' - ఈ రీజన్స్ చాలు సినిమా చూడటానికి
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. ఫిబ్రవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. దానికితోడు చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం.
సెన్సార్ పూర్తి చేసుకున్న ఉప్పెన
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. నిజానికి గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉండడంతో విడుదల కాలేదు. ఈ లోపు ఈ సినిమాకు నీ కళ్లు నీలి సముద్రం అన్న పాట కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కోసం మంచి క్యూరియాసిటీతోనే ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. దానికి ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ పెంచిన అంచనాలే కారణం. అంతేకాదు వర్సటైల్ యాక్టర్ విజయసేతుపతి నెగిటివ్ పాత్ర చేయడం కూడా ఒక కారణం. ఇంకా ఈ సినిమా రిలీజ్ ఒక్కరోజు మాత్రమే ఉంది. ఎలాగూ సినిమా హిట్…
ఆకట్టుకుంటున్న ఉప్పెన ట్రైలర్ - ప్రేమ చరిత్రలోనే ఉంటుంది
మొత్తానికి అందరూ ఆసక్తిగాఎదురుచూస్తున్న ఉప్పెన ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాపై మొదటినుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఒకరకంగా ఈ సినిమాకు అంత హైప్ రావడానికి కారణం ఈ సినిమా నుండి విడుదలైన నీ కళ్లు నీలి సముద్రం పాట అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. ఆ పాట మొదలైన హైప్ పోస్టర్స్, టీజర్ తో మరింత పెరిగింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు.
'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది నుండి ఎదురుచూస్తున్నాడు వైష్ణవ్ కూడా. ఫైనల్లీ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, పోస్టర్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టు వైష్ణవ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ మరింత ఆకట్టుకొని ఆ అంచనాలను రెట్టింపు చేసింది. హీరో, హీరోయిన్ నటన బావుందని.. సినిమాలో కొత్తదనం కనిపిస్తోందన్న…
'ఉప్పెన' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి వస్తున్న డెబ్యూ హీరో వైష్ణవ తేజ్. సాయి తేజ్ తమ్ముడిగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఈ హీరో ఎంట్రీ ఎప్పుడో అవ్వాలి కానీ లాక్ డౌన్ వల్ల లేట్ అయిపోయింది. ఏడాది తర్వాత ఇప్పుడు ఫైనల్లీ థియేటర్స్ లోకి వస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఇక ఇప్పటికే ఈ సినిమా పాటలతో సినిమాపై అంచనాలు పెంచగా.. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి.
"ఉప్పెన " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా రూపొందిన "ఉప్పెన " మూవీ ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. "ఉప్పెన " మూవీ తో హీరో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు.
"ఉప్పెన "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన "ఉప్పెన" మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. "ఉప్పెన" మూవీ తో హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఉప్పెన 'టీజర్' రిలీజ్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. లాక్ డౌన్ టైం లో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కానీ’ఉప్పెన’ మాత్రం ఓటీటీకి నో చెప్పింది. ఇక పాటలతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు చేరిపోయాయి. మరోపక్క ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అవకాశాల "ఉప్పెన "లో కృతి శెట్టి
భరత నాట్యం పెర్ఫార్మర్ , థియేటర్ ఆర్టిస్ట్ కృతి శెట్టి "సరిగమ " కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. పలు తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన కృతి శెట్టి , బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన "ఉప్పెన " మూవీ లో కథానాయికగా నటించారు. కరోనా కారణంగా "ఉప్పెన " మూవీ విడుదల వాయిదా పడింది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కృతి శెట్టి టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకొనడం విశేషం.