డీఎస్పీ, కృతి శెట్టి కి ‘మెగా సర్ ప్రైజ్’

Rockstar Devi Sri Prasad and Krithi Shetty Receive Surprise Gifts From Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Surprise Gift From Megastar Chiranjeevi,Love from DSP,Uppena,Appreciation Letter From Megastar Chiranjeevi,Rockstar Devi Sri Prasad,DSP,Krithi Shetty Receive Surprise Gifts From Megastar Chiranjeevi,Rockstar DSP Receive Surprise Gifts From Megastar Chiranjeevi,DSP Music,Rockstar DSP,Devi Sri Prasad Music,Megastar Chiranjeevi,Uppena,Uppena Songs,Vaishnav Tej,Krithi Shetty,Chiranjeevi DSP,Actress Krithi Shetty,Heroine Krithi Shetty,Megastar Chiranjeevi Latest News,DSP Receive Surprise Gift From Chiranjeevi,Krithi Shetty Receive Surprise Gift From Chiranjeevi,Uppena Movie,Uppena Telugu Movie

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత సంచలనమైన హిట్ కొట్టిందో చూస్తున్నాం. వైష్ణవ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, సాయి చంద్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 12 న రిలీజ్ అయి ఉప్పెనలా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. డెబ్యూ హీరోగా కలెక్షన్స్ పరంగా వైష్ణవ్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విజయంలో వైష్ణవ్, విజయ్ సేతుపతి పాత్ర ఎంత వుందో హీరోయిన్ కృతి శెట్టి, దేవి శ్రీ ప్రసాద్ పాత్ర కూడా అంతే ఉందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి వారికి మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ విషయాన్ని దేవి, కృతి ఇద్దరూ తమ ట్విట్టర్ లో తెలియచేస్తూ సంబరపడిపోతున్నారు. ఇక దేవి కి రాసిన లేఖలో “డియర్‌ డీఎస్పీ, ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్‌ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావో, చిత్రరంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కు అంతే ప్యాషన్‌తో సంగీతాన్నిస్తావు. నీలో ఉండే నీ ఎనర్జీ సినిమాలకు, మ్యూజిక్‌కు ఇచ్చే ఈ ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అని రాసుకొచ్చారు.

ఇక కృతి శెట్టి లేఖలో భాష తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ , పాత్ర‌లో అద్భుతంగా జీవించావు. బేబ‌మ్మ పాత్రను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. మంచి విజ‌యాల‌ను సాధించ‌కుంటూ ఇలానే ముందుకు సాగిపో అని చిరు లేఖ‌లో పేర్కొన్నారు. చిరు లేఖ‌పై స్పందించిన కృతి శెట్టి.. చిరు స‌ర్ థ్యాంక్యూ.. మీ మాట‌లు నా హృద‌యాన్ని తాకాయి. మీరు పంపిన గిఫ్ట్‌, మీ మాట‌లు ఎప్ప‌టికీ నా హృద‌యంలో నిలిచిపోతాయి. మీ ఆశీస్సులు పొందినందుకు ఆనందంలో తేలిపోతున్నా అని పేర్కొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.