ఆకట్టుకుంటున్న ఉప్పెన ట్రైలర్ – ప్రేమ చరిత్రలోనే ఉంటుంది

Uppena Trailer Gets Good Response From The Audience,Uppena,Uppena Movie,Uppena Telugu Movie,Uppena Trailer,Uppena Movie Trailer,Uppena Telugu Movie Trailer,Vaishnav Tej Uppena Trailer,Vaishnav Tej Uppena Official Trailer,Uppena Trailer Public Talk,Uppena Movie Trailer Public Talk,Uppena Telugu Movie Trailer Public Talk,Uppena Trailer Public Response,Uppena Movie Trailer Public Response,Uppena Telugu Movie Trailer Public Response,Uppena Movie Updates,Uppena Telugu Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Vaishnav Tej Starrer Uppena Movie Trailer Released Now

మొత్తానికి అందరూ ఆసక్తిగాఎదురుచూస్తున్న ఉప్పెన ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాపై మొదటినుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఒకరకంగా ఈ సినిమాకు అంత హైప్ రావడానికి కారణం ఈ సినిమా నుండి విడుదలైన నీ కళ్లు నీలి సముద్రం పాట అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. ఆ పాట మొదలైన హైప్ పోస్టర్స్, టీజర్ తో మరింత పెరిగింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. పేదింటి అబ్బాయి.. డబ్బున్న అమ్మాయి.. వారి మధ్య ప్రేమ.. ఈ పాయింట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి.. వస్తూనే ఉంటాయి. ఇక ఉప్పెన సినిమా కూడా అదే పాయింట్ తో వస్తుందని అర్ధమవుతుంది. అయితే ఈ సినిమాలో కొత్తదనం ఏముంటుందో అన్న విషయం మాత్రం సినిమా చూస్తేనే అర్ధమవుతుంది. మరోవైపు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ‘ప్రేమంటే ఓ లైలా-మజ్నులా, దేవదాసు-పార్వతిలా, రొమియో-జూలియట్‌లా అదో మాదిరిలా ఉండాలిరా’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో మొదలవ్వగా.. అటు ప్రేమ సన్నివేశాలతో పాటు విజయ సేతుపతి విలనిజం కూడా చూపించారు. ప్రేమ గొప్పదైతే చరిత్రలోనూ, సమాధుల్లోనూ కనబడాలి గానీ.. పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కని ఇళ్లల్లో కనపడితే దాని విలువ తగ్గిపోదూ.. అందుకే ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు.. అని విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ప్రేమ, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో పడే కష్టాలు.. పరువు కోసం తండ్రి తాపత్రయం కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. ఇప్పటి వరకు పాటలతోనే సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం ట్రైలర్‌తో మరింతగా సినిమాపై అంచనాలు పెంచేసింది.

కాగా బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nine =