ఉప్పెన ‘టీజర్’ రిలీజ్

Uppena teaser out now,Uppena Teaser: Vaishnav Tej And Krithi Shetty As Childhood Sweethearts Define True Love,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Uppena,Uppena Movie,Uppena Telugu Movie,Uppena Movie Updates,Uppena Telugu Movie Latest News,Uppena Movie Teaser,Uppena Teaser,Uppena Telugu Movie Teaser,Uppena Official Teaser,Uppena Latest Teaser

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. లాక్ డౌన్ టైం లో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కానీ’ఉప్పెన’ మాత్రం ఓటీటీకి నో చెప్పింది. ఇక పాట‌ల‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు చేరిపోయాయి. మరోపక్క ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ ఎదురు చూపులకు కాస్త ఊరటనిస్తూ తాజాగా ఈ సినిమా నుండి టీజ‌ర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసాడు. దేవుడే వరాలిస్తాడ‌ని నాక‌ర్థ‌మయింది. ఎవ‌రికి పుట్టామో అంద‌రికీ తెలుస్తుంది.. కానీ ఎవ‌రి కోసం పుట్టానో నా చిన్న‌ప్పుడే తెలిసిపోయింది’..అంటూ వైష్ణ‌వ్‌ తేజ్ సంబాషణలతో టీజర్ మొదలవుతుంది. ఇక మొదటి పాటతోనే అందర్నీ ఆకట్టుకొని సినిమా రిలీజ్ అవ్వకముందే వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న కృతిశెట్టి సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలుస్తుందని టీజ‌ర్ ను చూస్తే అర్థ‌మవుతోంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.