‘ఉప్పెన’ టీమ్ కు బన్నీ అభినందనలు

Stylish Star Allu Arjun Applauds Uppena Team On Movie Success,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Uppena,Uppena Movie,Uppena Film,Uppena Telugu Movie,Uppena Update,Uppena Movie Latest News,Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Gets Special Screening,Uppena Special Screening For Allu Arjun,Uppena Movie Special Screening For Allu Arjun,Uppena Movie Special Screening For Stylish Star Allu Arjun,Vaishnav Tej,Buchi Babu,Uppena Movie Special Screening For Stylish Star,Uppena Special Screening For Allu Arjun,Uppena Movie Special Screening For Bunny,Allu Arjun About Uppena,Allu Arjun Watch Uppena Movie,Krithi Shetty,Allu Arjun Applauds Uppena Team,Allu Arjun On Movie Success

ఈమధ్య మన హీరోలు ఏదైనా సినిమా బాగుంటే సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాపై ప్రశంసలు కురింపించడం చూస్తూనే ఉన్నాం. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకడుగు ముందే ఉంటాడు. చిత్రటీమ్ ను పిలిపించి మరీ వారిని అభినందించడం అల్లు అర్జున్ కు అలవాటు. ఇక ఇప్పుడు తాజాగా ఉప్పెన టీమ్ ను కూడా అభినందించాడు బన్నీ. ఇన్ని రోజులు బన్నీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా హైద్రాబాద్ చేరుకున్న బన్నీకి పుష్ప నిర్మాతలు స్పెషల్ షో వేశారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా చూసిన తరువాత బన్నీ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారట. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించారట. తొలి సినిమాతోనే అద్భుతమైన నటనను కనబరిచారని.. అలాగే విజయ్ సేతుపతి నటన గురించి ప్రశంసించారట. ఒక సున్నితమైన పాయింట్ తీసుకొని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు పనితీరు గురించి ప్రత్యేకంగా ప్రశంసించాడట అల్లు అర్జున్.

కాగా బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. విరామం కూడా లేకుండా మారేడుపల్లి, టెన్ కాశీ లాంటి ప్రదేశాల్లో పుష్ప షూటింగ్ జరుపుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =