రివ్యూ .. ప్రేమ, సంఘర్షణల ‘ఉప్పెన’

Uppena Movie Review : A Love Entertainer With Perfect Blend Of All Emotions,Krithi Shetty,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Uppena,Uppena Movie,Uppena Movie Public Response,Uppena Movie Public Talk,Uppena Movie Public Talk And Public Response,Uppena Movie Review, Uppena Movie Review And Rating,Uppena Movie Updates,Uppena Public Response,Uppena Public Talk,Uppena Public Talk And Public Response,Uppena Review, Uppena Review And Rating,Uppena Telugu Movie,Uppena Telugu Movie Latest News,Uppena Telugu Movie Public Response,Uppena Telugu Movie Public Talk,Uppena Telugu Movie Public Talk And Public Response,Uppena Telugu Movie Review,Uppena Telugu Movie Review And Rating,Vaishnav Tej,Vijay Sethupathi

ఫైనల్లీ అందరూ ఎదురుచూస్తున్న ‘ఉప్పెన’ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మెగా కాంపౌండ్ నుండి పరిచయమవుతున్న వైష్ణవ్ తేజ్ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్ గా వస్తున్న సినిమా ఉప్పెన. ఇప్పటికే ఈ సినిమాపై ఎంత భారీ అంచనాలు ఉన్నాయో చూశాం. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన పాటలన్నిటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన సినిమా… ఆ అంచనాలను రీచ్ అయిందో లేదో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, సాయి చంద్ రాజీవ్‌ కనకాల తదితరులు
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్
డైరెక్టర్ : బుచ్చిబాబు సానా
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్

కథ..

జాలయ్య(సాయిచంద్‌), ఆశీ(వైష్ణవ్‌తేజ్‌) తండ్రి కొడుకులు. సముద్రంలో చేపలు పట్టుకుంటూ బ్రతుకుతుంటారు. మరో పక్క కోటగిరి శేషారాయనం(విజయ్‌ సేతుపతి) అతడి కూతురు బేబమ్మ(కృతిశెట్టి). శేషారాయనం మంచి పలుకుబడి వున్న మనిషి. పరువే ప్రాణంగా బ్రతికే మనిషి. ఇక రెండు భిన్న కుటుంబాలకు చెందిన ఆశీ, బేబమ్మ ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ విషయం కాస్త శేషారాయనంకు తెలుస్తుంది. మరి వారి గురించి ప్రేమను తెలుసుకున్న శేషారాయనం వారి ప్రేమను ఎలా అడ్డుకున్నాడు.. ఎలాంటి చర్యలకు పాల్పడ్డాడు.. ఆశీ-బేబమ్మ ఎదిరించి ఎలా నిలబడ్డారు అన్నది కథ..

విశ్లేషణ..

మనకు ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది కదా కథ ఎలా ఉంటుందో అని… పేదింటి కుర్రాడు.. గొప్పింటి అమ్మాయి వారిద్దరి మధ్య ప్రేమ.. వారి ప్రేమకు అడ్డంకులు చెప్పుకున్నాం కదా ఈ థీమ్ తో ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయని. ఉప్పెన సినిమా కథాంశం కూడా అలాంటిందే. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్స్, మిగిలిన పాత్రల ఇంట్రడక్షన్.. హీరోహీరోయిన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ఇలా నడిచిపోయింది. ఫస్టాఫ్‌లో వచ్చే మూడు పాటలు ఆకట్టుకుంటాయి. మిగిలిన కథ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఇక గతకొద్ది రోజులుగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి పలు వార్తలు వింటూనే ఉన్నాం. ఇక చెప్పినట్టే ఉంటుంది ఈ సినిమా క్లైమాక్స్ కూడా. సినిమాను చూసిన వారంతా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఒకరకంగా ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్తగానే అనిపిస్తుంది.

మంచి కంటెంట్ ఉన్న దర్శకుడే అని తొలి చిత్రంతోనే అనిపించుకున్నాడు బుచ్చిబాబు. కథ పాతదే అయినా కూడా కొత్తగా చూపించగలిగాడు. ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం కానీ రెండు శరీరాలకు సంబంధించిన విషయం కాదని కన్విన్సింగ్ గా చెప్పగలిగాడు. ఇక ఈ సినిమా కాస్టింగ్ సెలక్షన్ లోనే బుచ్చిబాబు సగం సక్సెస్ అయ్యాడు. ఈ కథకు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లాంటి ఫ్రెష్ పేస్ లే కరెక్ట్ అని వీరిని చూసిన తర్వాత అర్ధమవుతుంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి పోటీపడి మరీ నటించారు. మెగా హీరో మొదటి సినిమానే ఇలాంటి డీ గ్లామర్ పాత్రను ఎంచుకున్నాడంటే నిజంగా వైష్ణవ్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం. గతఏడాది విడుదలైన పాటలోని తన ఎక్స్‌ప్రెషన్స్ తో యూత్ ను ఆకట్టుకుంది. సినిమాలో కూడా ఆమె క్యూట్ లుక్స్, పెర్ఫామెన్స్ తో అందర్నీ కట్టిపడేసింది. అంతేకాదు ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా చక్కగా హావభావాలు పలికించింది. వారితో పాటు సినిమాకు మొదటి నుండి హైలైట్ అయిన విజయ్‌సేతుపతి పాత్ర. పరువు కోసం నిరంతరం తపన పడే తండ్రిగా ఆయన నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆయన కనిపించే ప్రతి సన్నివేశం సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతుంది. హీరో తండ్రి పాత్రలో సాయిచంద్‌ ఒదిగిపోయారు.

ఇక ఈ సినిమాకు మొదటినుండి మరో హైలెట్‌ ఏంటంటే.. దేవిశ్రీ ప్రాసాద్‌ సంగీతం. తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. తన బీజీయంతో సినిమాకు ప్రాణం పోశాడు. శ్యామ్ దత్ విజువల్స్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పిన ఈ ‘ఉప్పెన’ అందరికీ నచ్చుతుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 12 =