
ట్యాగ్ · 804 కథనాలు · పేజీ 38


నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

గంగోత్రి మూవీ జోడీ లేటెస్ట్ ఫొటో

శాకిని డాకిని టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్

1 మిలియన్ క్లబ్ లో కార్తికేయ2

కరెక్ట్ అయినప్పుడు తగ్గేదేలేదు అంటున్న 'లైగర్'

పుష్ప 2 గ్రాండ్ లాంచ్

ఎన్టీఆర్ ఆస్కార్ పై లైగర్ కామెంట్స్

చిరంజీవి కి థ్యాంక్స్ చెప్పిన మణిరత్నం

దసరా బరిలో నాగార్జున ది ఘోస్ట్

లైగర్ టీమ్ ఎమోషనల్

సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి సీతారామం

డబుల్ బ్లాక్ బస్టర్ బింబిసార

బిగ్ బీ బ్లెస్సింగ్స్.. లైఫ్ టైమ్ మెమరీ..

జైలర్ సినిమా షూటింగ్ స్టార్ట్
డాక్టర్, బీస్ట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే రజనీకాంత్ అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ బాగానే ఈసినిమాకు మంచి టాక్ లభించింది. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్- రజనీకాంత్ కాంబినేషన్ సినిమా వస్తుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169వ సినిమా ఇది. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ కు మంచి సినిమా అందించేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటాడు. ఇప్పటికే ఒక సినిమాను రిలీజ్ కు సిద్దంగా ఉంచాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఈసినిమా సెప్టెంబర్ 23వతేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉంది.

టాలీవుడ్ బాక్సాఫీస్ డల్ అవ్వడానికి కారణాలు?
తెలుగు సినీ ప్రేక్షకులు సినిమాను ఎలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ ప్రేమికులకు పండగే. ఇప్పుడంటే ఏ రోజు కుదిరితే అప్పుడు రిలీజ్ చేస్తున్నారు కానీ ఇంతకుముందు మాత్రం శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండేది. ఇక ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. హీరో ఎవరైనా.. ఏ భాష నుండి వచ్చినా సరే ఇక్కడికి వచ్చారంటే వారికి హృదయపూర్వకంగా ఆదరిస్తారు. అందుకే సౌత్ నుండి నార్త్ వరకూ ఎవరు సినిమాలు రిలీజ్ చేసుకున్నా కంటెంట్ ఉంటే మాత్రం సినిమా సూపర్ హిట్టే. అందుకే మన తెలుగు ఆడియన్స్ చూపించే…

గంగోత్రి మూవీ జోడీ లేటెస్ట్ ఫొటో
యునైటెడ్ ప్రొడ్యూసర్స్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన గంగోత్రి మూవీ 2003 మార్చి 28 వ తేదీ రిలీజ్ అయ్యింది. దర్శకుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 100 వ మూవీ గా తెరకెక్కిన గంగోత్రి మూవీ తో అల్లు అర్జున్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అదితి అగర్వాల్ కథానాయిక. ప్రకాష్ రాజ్ , సుమన్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి గంగోత్రి మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

లెజెండరీ యాక్ట్రెస్ మధుబాల బయోపిక్ లో నటించాలని ఉంది - మృణాల్ ఠాకూర్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది…

శాకిని డాకిని టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రసుతం రీమేక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో రిలీజ్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కామన్ అయిపోయింది. ఇది కేవలం మన సినిమాల వరకే కాదు.. వేరే దేశాల్లో హిట్ అయిన సినిమాను కూడా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కొరియన్ సినిమాను ఇక్కడ ఓబేబి సినిమాగా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరో కొరియన్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

1 మిలియన్ క్లబ్ లో కార్తికేయ2
మొత్తానికి నిఖిల్ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా కార్తికేయ2 తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమాను కరోనా ముందు స్టార్ట్ చేశారు. కరోనా వల్ల మధ్యలో బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫైనల్ గా అన్ని పరిస్థితులను అనుగుణంగా చేసుకొని ఈనెల 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చందూ మొండేటి ఈసారి ద్వారక నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ గా కథను తెరకెక్కించాడు. అడ్వంచరస్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈసినిమా అందరికీ నచ్చేస్తుంది. అందుకే సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అవ్వస్తున్నా ఇంకా సక్సెస్ ఫుల్ గానే నడుస్తుంది…

కరెక్ట్ అయినప్పుడు తగ్గేదేలేదు అంటున్న 'లైగర్'
బాలీవుడ్ లో ప్రస్తుతం బాయ్ కట్ సంప్రదాయం బాగా నడుస్తుంది. మరీ ముఖ్యంగా కరణ్ జోహర్ సినిమాలకు కొంతమంది వ్యతిరేకంగా సోషల్ మీడియాల్లో బాయ్ కట్ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. కరణ్ జోహర్ పై నెపోటిజం ప్రభావం ఎప్పటినుండో ఉంది. స్టార్ కిడ్స్ కు మాత్రమే కరణ్ జోహర్ సపోర్డ్ ఉంటుంది అంటూ ఎప్పటినుండో నార్త్ ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది. ఈనేపథ్యంలో ఇప్పుడు ఈ ఎఫెక్టే లైగర్ సినిమాపై పడింది. రెండు మూడు రోజుల నుండి ఈసినిమాను బాయ్ కట్ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు విజయ్ కి సపోర్టుగా నిలుస్తున్నారు. సినీ ఇండిస్టీలో ఎవరి సపోర్టు లేకుండానే విజయ్ ఈ స్థాయికి వచ్చారని తనకి…

పుష్ప 2 గ్రాండ్ లాంచ్
స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా కోసం ఇంతవరకూ స్టైలిష్ లుక్కులతో అలరించిన బన్నీ పూర్తిగా తన లుక్ ను మార్చేసి ప్రయోగాత్మకంగా వచ్చాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు,తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజం, తన నటన, సుకుమార్ కథ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇలా అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ ఆస్కార్ పై లైగర్ కామెంట్స్
గతకొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డుల బరిలో తారక్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమాపై అలానే ఎన్టీఆర్ నటనపై ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించడంతో ఎన్టీఆర్ కి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఎన్టీఆర్ ఆస్కార్ పై స్పందించాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ‘లైగర్’. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై మొదటినుండీ అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఉన్న టైమ్ ను చిత్రయూనిట్ మ్యాగ్జిమమ్…

చిరంజీవి కి థ్యాంక్స్ చెప్పిన మణిరత్నం
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్…

దసరా బరిలో నాగార్జున ది ఘోస్ట్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఘరానా మొగుడు స్పెషల్ షోస్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన హీరోల బర్త్ డే కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ స్పెషల్ షోస్ థియేటర్స్ లో ప్రదర్శిస్తూ అభిమానులు తమ అభిమానం చాటుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కు సూపర్ హిట్ పోకిరి మూవీ స్పెషల్ షోస్ భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ జల్సా మూవీ ని పవన్ కళ్యాణ్ బర్త్ డే కు స్పెషల్ షోస్ ను అభిమానులు ప్లాన్ చేశారు. తాజాగా చిరంజీవి బర్త్ డే (ఆగస్ట్ 22 ) కు హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు మూవీ స్పెషల్ షోస్ ను 21 , 22 తేదీలను అభిమానులు ప్లాన్ చేశారు.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుంటున్న ఘరానా మొగుడు…

లైగర్ టీమ్ ఎమోషనల్
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారిపోయింది ఛార్మి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరీ-ఛార్మీ ఇద్దరూ కలిసి నిర్మించారు. ఇక ఇప్పుడు లైగర్ తో వచ్చేస్తున్నారు. పూరీ-ఛార్మి నిర్మించిన ఈసినిమాలో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆగష్ట్ 25న రిలీజ్ కానుండటంతో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి సీతారామం
ఈరోజుల్లో ఒక సినిమా గట్టిగా పది రోజులు థియేటర్లలో ఆడిందంటే చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సూపర్ హిట్ అయితే తప్పా ఆ సినిమాను థియేటర్లలో ఉంచే పరిస్థితి లేదు. ఇక కరోనా వల్ల పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. సినిమాలు ఆడటం సంగతి పక్కన పెడితే.. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టంగా మారింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ఈనేపథ్యంలోనే కొన్ని సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ప్రాణం పోస్తున్నాయి. అలాంటి వాటిలో రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమా కూడా ఒకటి.

డబుల్ బ్లాక్ బస్టర్ బింబిసార
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న బింబిసార మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం…

బిగ్ బీ బ్లెస్సింగ్స్.. లైఫ్ టైమ్ మెమరీ..
చందూమొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కార్తికేయ2. కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. ద్వారక, కృష్ణుడి కంకణం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కించాడు చందూ మొండేటి. ఫైనల్ గా ఈసినిమా ఆగష్ట్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక నార్త్ లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నప్పటికీ నార్త్ లో అస్సలు ప్రమోషన్సే పెద్దగా చేయలేదు. కానీ రిలీజ్ తర్వాత మౌత్ టాక్ తోనే నార్త్ లో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈసినిమా ఇప్పుడు అక్కడ వెయ్యికి…

వన్ మంత్ లాంగ్ వెకేషన్ తరువాత సెట్స్ కు పూజా హెగ్డే
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కభీ ఈద్ కభీ దివాలీ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు #SSMB28, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.30 రోజుల లాంగ్ హాలీడేను పూజాహెగ్డే ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

అభిమానులకు ప్రగ్యా జైస్వాల్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. జిల్లా కలెక్టర్ గా అఖండ మూవీ లో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకున్నారు. . బాలయ్యతో కలసి జై బాలయ్య సాంగ్ లో ప్రగ్యా వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు.