ఎన్టీఆర్ ఆస్కార్ పై లైగర్ కామెంట్స్

Liger Vijay Deverakonda Supports “NTR For Oscars”,Vijay Deverakonda comments on Oscar for Jr NTR,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Jr NTR,Young Tiger Jr NTR,Liger Comments on Jr NTR,Jr NTR Oscar Nomination,Liger Movie,Vijay Deverakond,Hero Vijay Deverakonda,Vijay Devera Konda About Jr NTR Oscar, Vijay Deverakonda About Jr NTR,Vijay Deverakonda Comments on Jr NTR,Vijay Deverakonda Liger Movie Updates,Vijay Deverakonda Upcoming Movie Liger

గతకొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డుల బరిలో తారక్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమాపై అలానే ఎన్టీఆర్ నటనపై ఎంతో మంది హాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపించడంతో ఎన్టీఆర్ కి ఆస్కార్ వ‌చ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఎన్టీఆర్ ఆస్కార్ పై స్పందించాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ‘లైగర్’. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై మొదటినుండీ అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఉన్న టైమ్ ను చిత్రయూనిట్ మ్యాగ్జిమమ్ వాడుకుంటున్నారు. నార్త్ నుండి సౌత్ వరకూ తిరిగేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆస్కార్ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒక వేళ తారక్ అన్న ఆస్కార్ గెలిస్తే మెంటల్ అసలు. మన దేశానికి ఆస్కార్ వస్తే ఆ హైప్ వేరుగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ డెడ్లీ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అదే కనుక జరిగితే ఒక మ్యాజిక్ లాగా చాలా బావుంటుంది’ అని అన్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + five =