డాక్టర్, బీస్ట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే రజనీకాంత్ అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ బాగానే ఈసినిమాకు మంచి టాక్ లభించింది. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్- రజనీకాంత్ కాంబినేషన్ సినిమా వస్తుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169వ సినిమా ఇది. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగష్ట్ 15 లేదా ఆగష్ట్ 22 నుండి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 15 న స్టార్ట్ కాలేదు కానీ నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో మొదటి షెడ్యూల్ కోసం పోలీస్ స్టేషన్ సెట్ వేశారట మేకర్స్. ఈ షూటింగ్ పార్టులో రజినీకాంత్‌తోపాటు పలువురు నటీనటులు పాల్గొనున్నారని టాక్.
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివరాజ్‌కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























