ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన హీరోల బర్త్ డే కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ స్పెషల్ షోస్ థియేటర్స్ లో ప్రదర్శిస్తూ అభిమానులు తమ అభిమానం చాటుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కు సూపర్ హిట్ పోకిరి మూవీ స్పెషల్ షోస్ భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ జల్సా మూవీ ని పవన్ కళ్యాణ్ బర్త్ డే కు స్పెషల్ షోస్ ను అభిమానులు ప్లాన్ చేశారు. తాజాగా చిరంజీవి బర్త్ డే (ఆగస్ట్ 22 ) కు హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు మూవీ స్పెషల్ షోస్ ను 21 , 22 తేదీలను అభిమానులు ప్లాన్ చేశారు.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుంటున్న ఘరానా మొగుడు స్పెషల్ షోస్ కు భారీ స్పందన లభిస్తుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి , నగ్మా , వాణీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఘరానా మొగుడు మూవీ 1992 ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ ఆ రోజుల్లోనే 10 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. సంగీత దర్శకుడు స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఘరానా మొగుడు స్పెషల్ షోస్ ఎంత కలెక్ట్ చేయనున్నాయో వేచి చూడాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































