తెలుగు సినీ ప్రేక్షకులు సినిమాను ఎలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ ప్రేమికులకు పండగే. ఇప్పుడంటే ఏ రోజు కుదిరితే అప్పుడు రిలీజ్ చేస్తున్నారు కానీ ఇంతకుముందు మాత్రం శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండేది. ఇక ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. హీరో ఎవరైనా.. ఏ భాష నుండి వచ్చినా సరే ఇక్కడికి వచ్చారంటే వారికి హృదయపూర్వకంగా ఆదరిస్తారు. అందుకే సౌత్ నుండి నార్త్ వరకూ ఎవరు సినిమాలు రిలీజ్ చేసుకున్నా కంటెంట్ ఉంటే మాత్రం సినిమా సూపర్ హిట్టే. అందుకే మన తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు ఎంతోమంది నటీ నటులు మరిచిపోలేరు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈమధ్య కాలంలో పరిస్థితులు చాలా వరకూ మారాయి. దీనికి కారణం ఒకటని చెప్పడం చాలా కష్టం. కరోనా ముందు వరకూ కాస్త బాగానే ఉంది కానీ కరోనా తరువాతే పరిస్థితులు తలక్రిందులైపోయాయి. ముఖ్యంగా థియేటర్లు మూత పడటం వల్, దానివల్ల ఓటీటీల ప్రభావం ఎక్కువవడం వల్ల సినిమా పరిశ్రమలపై ఎఫెకంట్ బాగానే పడుతుంది. ఇంతకుముందు కూడా ఓటీటీలు ఉన్నాయి. కానీ కరోనా వల్ల డైరెక్ట్ గా ఓటీటీలలో రిలీజ్ చేయడం.. లేకపోతే థియేటర్లలో రిలీజ్ అయిన వారంరోజుల్లోనే ఓటీటీల్లోకి ఇచ్చేయడం వల్ల ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోయింది.
ఏదో ఈమధ్యే కాస్త పరిస్థితులు కుదుటపడుతున్నాయి కదా అనుకుంటుండగానే ఇండస్ట్రీలో సినిమా రేట్ల, ఓటీటీల రిలీజ్ ల వివాదాలు. ఇవన్నీ చాలదన్నట్టు రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ రేటు 10 శాతం ఉంటే.. పరాజయాన్ని అందుకునే సినిమాలే ఉన్నాయి. గత రెండు నెలలు అయితే మరీ దారుణం. ఏదో ఈ నెలలో కాస్త సీతారామం, బింబిసార, కార్తికేయ2 సినిమాలు కాస్త ఊపిరినిచ్చాయి. ఇలా పలు కారణాలు కళకళలాడే టాలీవుడ్ బాక్సాఫీస్ పై బాగానే ప్రభావం చూపుతున్నాయి.
మరి టాలీవుడ్ బాక్సాఫీస్ డల్ అవ్వడానికి కారణాలు ఏమై ఉండవచ్చని మీరు అనుకుంటున్నారో కింద ఇచ్చిన వాటిలో ఎంచుకొని ఓటు ద్వారా తెలియచేయండి..?
[totalpoll id=”86100″]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: