శాకిని డాకిని టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Saakini Daakini Teaser Release Date Fixed,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Saakini Daakini,Saakini Daakini Movie,Saakini Daakini Telugu Movie,Saakini Daakini Movie Teaser,Saakini Daakini Telugu Movie Teaser, Saakini Daakini Movie Teaser Released,Saakini Daakini Movie Teaser Out,Saakini Daakini Telugu Movie Teaser Released Now,Saakini Daakini Release Date Fixed, Saakini Daakini Release Date Confirmed,Nivetha Thomas and Regina Cassandra,Actress Nivetha Thomas and Regina Cassandra Upcoming Movie Saakini Daakini Teaser Release Date Fixed

ప్రసుతం రీమేక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో రిలీజ్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కామన్ అయిపోయింది. ఇది కేవలం మన సినిమాల వరకే కాదు.. వేరే దేశాల్లో హిట్ అయిన సినిమాను కూడా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కొరియన్ సినిమాను ఇక్కడ ఓబేబి సినిమాగా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరో కొరియన్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిస్తున్న సినిమా ‘శాకిని డాకిని’. కొరియ‌న్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. కొద్దిరోజుల క్రితమే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 16న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా టీజర్ ను ఆగష్ట్ 23వ తేదీన ఉదయం 11 గంటల 7నిమిషాలకు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరోసారి ఈసినిమాతో వస్తున్నారు. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈసినిమాకి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈసినిమా ఎంత హిట్ అవుతుందో చూడాలి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − two =