మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ నుండి ఒక లిరికల్ వీడియో ను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం థ్యాంక్స్ చెప్పారు. చిరంజీవి కి థ్యాంక్స్ ఎందుకు చెబుతున్నానో.. ఇప్పుడే చెప్పనని ఆయన సస్పెన్స్ లో పెట్టేశారు. బహుశా చిరంజీవి ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండొచ్చని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: