టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ కు మంచి సినిమా అందించేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటాడు. ఇప్పటికే ఒక సినిమాను రిలీజ్ కు సిద్దంగా ఉంచాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఈసినిమా సెప్టెంబర్ 23వతేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈరోజు ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్ బోర్డ్ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.
Our Production No.6 begins today 💥💥
Starring @IamNagashaurya and #YuktiThareja. Directed by debutant @PawanBasamsetti.
Legendary director @Ragavendraraoba garu clapped the first shot 🎬 and handed the script while @odela_srikanth switched on the camera 🎥 pic.twitter.com/lOpesrXJJv
— SLV Cinemas (@SLVCinemasOffl) August 22, 2022
కాగా ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ మ్యూజిక్, వంశీ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: