సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి సీతారామం

Sita Ramam Enters Into Third Week Successfully,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Into Three Week,Sita Ramam Movie Enters into Third Week Successfully,Dulquer Salmaan, Dulquer Salmaan Upcoming Movies,Dulquer Salmaan Sita Ramam Movie Enters into Third Week

ఈరోజుల్లో ఒక సినిమా గట్టిగా పది రోజులు థియేటర్లలో ఆడిందంటే చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సూపర్ హిట్ అయితే తప్పా ఆ సినిమాను థియేటర్లలో ఉంచే పరిస్థితి లేదు. ఇక కరోనా వల్ల పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. సినిమాలు ఆడటం సంగతి పక్కన పెడితే.. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టంగా మారింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ఈనేపథ్యంలోనే కొన్ని సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ప్రాణం పోస్తున్నాయి. అలాంటి వాటిలో రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమా కూడా ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా క్లాసిక్ హిట్ ను కొట్టింది. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటన ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడం.. అఫ్రిన్ పాత్రలో నటించిన రష్మికమందన్న నటన ఇంకా పలు కీలకపాత్రల్లో నటించిన నటీనటులు అందరూ ఎవరి పాత్రల్లో వారు చక్కగా నటించడం.. దానికి తోడు హనురాఘవపూడి మేకింగ్, కథ, స్క్రీన్ ప్లే అన్నీ ఈసినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది. దీంతో ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సూపర్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. కుటుంబ ప్రేక్ష‌కులు ఇప్ప‌టికీ `సీతారామం`చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈసినిమా సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ సంతోషంగా తమ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఈసినిమా 65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్టు కూడా చిత్రయూనిట్ తెలిపింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 10 =