డబుల్ బ్లాక్‌ బస్టర్ బింబిసార

Bimbisara Movie Emerges As Double Blockbuster,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Double Blockbuster,Nandamuri Kalyan Ram,Kalyan Ram Emerges as Duble Blockbuster, Kalyan Ram Bimbisara Movie Double Blockbuster,Bimbisara Movie Collections,Bimbisara Collections,Bimbisara Wordl Wide Collections Updates,Bimbisara Collections Updates

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న బింబిసార మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.“బింబిసార” మూవీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు వారాల వ్యవధిలో బింబిసార వరల్డ్ వైడ్ షేర్ రూ.32 కోట్లను దాటిపోయింది. అంటే ఇప్పటికే ఈ చిత్రం డబుల్ బ్లాక్‌బస్టర్ అయిందన్నమాట. నైజాం ఏరియాలో దిల్ రాజు ఐదున్నర కోట్లకు కొంటే ఇప్పటికే అక్కడ షేర్ రూ.10 కోట్ల మార్కును దాటేసింది. సీడెడ్లో రూ.6.8 కోట్ల షేర్ రాబట్టిన బింబిసార.. వైజాగ్‌లో రూ.4.5 కోట్ల దాకా వాసులు చేసింది. ఆంధ్రాలోని మిగతా అన్ని ఏరియాల్లో కలిపి ఇంకో ఏడు కోట్ల దాకా షేర్ వచ్చింది. యుఎస్‌లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును దాటింది. ఈ వసూళ్లు గురువారం వరకే. ఇప్పటికీ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. మూడో వీకెండ్లో కూడా ఈ చిత్రం మంచి షేర్ రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్లో బింబిసార రూ.40 కోట్ల షేర్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో అంచనా వేయొచ్చు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 4 =