లెజెండరీ యాక్ట్రెస్ మధుబాల బయోపిక్ లో నటించాలని ఉంది – మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Wants To Act In This Biopic,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Mrunal Thakur,Actress Mrunal Thakur,Mrunal Thakur Movie Updates,Mrunal Thakur latest Movie Udpates,Mrunal Thakur Upcoming Movies,Mrunal Thakur Latest Movies Updates, Mrunal Thakur Wants to Act in Biopic,Madhubala Biopic,Mrunal Thakur Wants to Act in Madhubala Biopic,Mrunal Thakur Latest Movie Sitaramam,Mrunal Thakur Super Hit Movie Sita Ramam

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. సీతారామం మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీతారామం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ,ఆ మూవీ లో సీత పాత్రలో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం 4 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న మృణాల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. సీతారామం మూవీ షూటింగ్ సమయం లో అందరూ తనని బాలీవుడ్ లెజెండరీ యాక్ట్రెస్ మధుబాల తో కంపేర్ చేసేవారనీ , ఆ విషయం తాను గౌరవం గా భావించాననీ , మధుబాల బయోపిక్ మూవీ లో నటించాలని ఉందనీ తన మనసులోని కోరిక ను వెల్లడించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 6 =