కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 282

Suriya Visited Fan's House and Offered Condolences
సినిమా వార్తలు

అభిమాని ఇంటికి హీరో సూర్య.. ఎందుకంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గొప్ప మనసు చాటుకున్నారు. తన అభిమాని ఇంటికి వెళ్లిన ఆయన వారి కుటుంబాన్ని పరామర్శించారు. అసలేమైందంటే..? ఇటీవల సూర్య అభిమాని ఒకరు మరణించారు. అరవింద్ అనే అభిమాని సూర్య ఫ్యాన్స్ క్లబ్ సభ్యుడు కూడా. అయితే ఇటీవలే ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అరవింద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలియగానే.. హీరో సూర్య, అరవింద్ కుటుంబాన్ని కలుసుకోవడానికి గురువారం ఎన్నూర్‌లోని అతని ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అరవింద్ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
double ismart team special birthday wishes to puri jagannadh
సినిమా వార్తలు

డాషింగ్ డైరెక్టర్ కు డబుల్ ఇస్మార్ట్ టీమ్ విషెస్

టాలీవుడ్ లో ఎంతో మంది డైరెక్టర్లు ఉండగా ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి స్టైల్ లో వారు సినిమాలు తీస్తుంటారు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఉంటాయి తన సినిమాల్లోని డైలాగ్స్. అందుకే పూరీకి మాత్రం సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. అంతేకాదు హీరో, హీరోయిన్లను ఎలా చూపించాలో పూరీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తన సినిమాలతో ఎంతోమంది హీరోలకు ఎన్నో సూపర్ హిట్లను అందించాడు. ఈమధ్య అంటే కాంపిటీషన్ కాస్త ఎక్కువవ్వడంతో కొంచం స్లో అయ్యాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

TFN Adminవాట్సాప్
MS Dhoni's Debut Production LGM Movie Out on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ఎంఎస్ ధోని ‘ఎల్‌జీఎం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని తన సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి 'ధోనీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యానర్‌ నుంచి నిర్మించిన తొలి సినిమా ‘ఎల్‌జీఎం’. 'లెట్స్ గెట్ మ్యారీడ్' అనేది ఉప శీర్షిక. తమిళంలో రూపొందిన ఈ సినిమా డబ్బింగ్ చేసుకుని పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయింది. కాగా ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం సినిమా రంగంలోకి ఎంట‌ర్ అవుతూ ఫ‌స్ట్ టైమ్ ప్రొడ్యూస్ చేసిన మూవీ కావ‌డంతో.. మొదటినుంచీ ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన‌ ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్‌ హీరోగా, 'లవ్‌టుడే' ఫేమ్…

Srikanth Mవాట్సాప్
skanda movie telugu review
రివ్యూ

స్కంద రివ్యూ- బోయపాటి కల్ట్ మాస్ జాతర

ఓవరాల్ గా బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో రామ్ నటన,ఫైట్స్ ,డ్యాన్స్ ,ప్రీ ఇంటర్వెల్,ఇంటర్వెల్ సీన్స్,క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.మంచి మాస్ మాసాల ఎంటర్టైనర్ చూడాలనుకుంటే స్కంద ను చూసేయచ్చు.పక్కా ఎంటర్టైన్ చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
special surprise video will release from Bhagavanth Kesari movie
సినిమా వార్తలు

భగవంత్ కేసరి నుండి స్పెషల్ సర్ ప్రైజ్ వీడియో

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ల తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఈసినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజెన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతున్నట్టు అనిల్ రావిపూడి…

TFN Adminవాట్సాప్
Animal Telugu Teaser Released
ట్రైలర్ & టీజర్

యానిమల్ తెలుగు టీజర్ రిలీజ్

'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్‌ వైలెంట్‌ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్ తో చేసిన 'కబీర్ సింగ్' సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.

Srikanth Mవాట్సాప్
shah rukh khan interesting comment about thalapathy vijays next movie
సినిమా వార్తలు

దళపతి సినిమా కోసం చూస్తున్నా

జవాన్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చూపించాడు బాద్ షా షారుఖ్ ఖాన్. కరోనా తరువాత కుదేలయిన బాలీవుడ్ బాక్సాఫీస్ ను పఠాన్ సినిమాతో కాస్త కోలుకునేలా చేశాడు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ జవాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా రీసెంట్ గానే ఈసినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక షారుఖ్ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరడంతో విజయ్ ఫ్యాన్స్ తమ ట్విట్టర్ ద్వారా కింగ్ షారుఖ్ జవాన్ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసినందుకు కంగ్రాట్స్.. విజయ్ ఫ్యాన్స్ తరుపున ఈసినిమా షారుఖ్ కెరీర్ లోనే…

TFN Adminవాట్సాప్
ram gained weight for skanda
సినిమా వార్తలు

స్కంద కోసం రామ్ ఎన్ని కిలోలు పెరిగాడంటే

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ సినిమాల్లో ఫైట్స్ చేయాలంటే హీరోలు కష్టపడి కండలు పెంచాల్సిందే. బోయపాటి సీనియర్ హీరోలకు ఈరూల్ ను పాటించడు కానీ మిగితా హీరోలకు దాదాపు ఫాలో అవుతాడు.సరైనోడు,జయ జానకి నాయక ,వినయ విధేయ రామల్లో హీరోలు కండలు పెంచి మంచి ఫిజిక్ తో కనబడతారు.ఇంకా ఫైట్స్ చెప్పనక్కర్లేదు.ఓ రేంజ్ లో ఉంటాయి.బోయపాటి ఫైట్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు.ఇక యంగ్ హీరో రామ్ కు కూడా స్కంద ముందు కండలు పెంచాలనే రూల్ పెట్టాడట.దాంతో ఈసినిమా కోసం రామ్ ఏకంగా 12కిలోలకు బరువు పెరిగాడట.

Mahender Reddyవాట్సాప్
ram skanda movie gets 200k plus interests on book my show
సినిమా వార్తలు

స్కంద పై పెరుగుతున్న ఇంట్రెస్ట్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తున్న సినిమా స్కంద. మాస్ సినిమాలు తీయడంలో బోయపాటి దిట్ట.. అలాంటి బోయపాటి డైరెక్షన్ లో రామ్ హీరోగా ఈసినిమా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా సెప్టెంబర్28వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Thalapathy Vijay's Leo Audio Launch Event Cancelled
సినిమా వార్తలు

ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో ఆడియో లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్, ఎందుకంటే..?

తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం 'లియో'. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్‌ ద‌త్ కీల‌క పాత్ర‌లో కనిపించనున్నాడు. అక్టోబ‌ర్ 19న ద‌స‌రా సంద‌ర్భంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ కార్యక్రమాలు ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా సెప్టెంబ‌ర్ 30న చెన్నైలో 'లియో' ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేసింది. ఇందుకోసం నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని వేదిక‌గా ఖరారు కూడా చేసింది. ఈ ఈవెంట్‌తోనే సినిమా ప్ర‌మోష‌న్స్ ప్రారంభించాలని మేక‌ర్స్ భావించారు. అయితే తాజాగా ఈ ఈవెంట్‌ క్యాన్సిల్ అయినట్లు నిర్మాత‌లు…

Srikanth Mవాట్సాప్
producer nagavamsi talks about mad
సినిమా వార్తలు

కొంచెం తక్కువగా నవ్వినా డబ్బులు రిటర్న్ ఇస్తాను - నాగవంశీ

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే టాక్ వుంది.గత కొన్ని సంవత్సరాల నుండి క్వాలిటీ కంటెంట్ వున్న సినిమాలను అందిస్తూ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.ఇక ఈ బ్యానర్ నుండి వస్తున్న మీడియం బడ్జెట్ మూవీ మ్యాడ్.ఈసినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్,యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్,రామ్ నితిన్ హీరోలుగా నటించగా గౌరీ ప్రియా రెడ్డి,అనంతిక,గోపికా ఉద్యాన్ హీరోయిన్లు.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.ఈసినిమాను మొదట ఈనెల 28న విడుదలచేయాలనుకున్నారు కానీ అదే రోజు స్కంద,చంద్రముఖి 2 తరువాతి రోజు పెదకాపు…

Mahender Reddyవాట్సాప్
eagle release date out
రిలీజ్ అప్‌డేట్

ఈగల్ రిలీజ్ డేట్ ఫిక్స్

వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కోసం స్లాట్స్ బుక్ అవుతున్నాయి.అందులో భాగంగా రవితేజ -కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో వస్తున్న ఈగల్ రిలీజ్ డేట్ ను చెప్పేసారు మేకర్స్.ఈసినిమా జనవరి 13న విడుదలకానుంది.ఈ సందర్భంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.గ్లింప్స్ కూడా అదిరిపోయింది.స్టైలిష్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా నవదీప్,మధుబాల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Producer Naga Vamsi Gives Clarity on Release of Guntur Kaaram’s First Single
సినిమా వార్తలు

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. నిర్మాత నాగవంశీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు' విజయం సాధించగా.. 'ఖలేజా" ఆకట్టుకోలేకపోయింది. ఇక వీరి కలయికలో 'గుంటూరు కారం' మూడో సినిమాగా వస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం, అలాగే మహేశ్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో 'గుంటూరు కారం'పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దీంతో మూవీకి సంబంధించిన అప్‍డేట్స్ కోసం వారు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ…

Srikanth Mవాట్సాప్
virat karrna shares interesting facts about peddha kapu1 movie
సినిమా వార్తలు

పెదకాపు-1 కథతో పరిచయం కావడం ఆనందంగా ఉంది.. హీరో విరాట్ కర్ణ

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా వస్తున్న సినిమా పెదకాపు-1. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈసినిమా రెండు భాగాలుగా రానుండగా.. ఈసినిమా మొదటి భాగం సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనలతో బిజీగా ఉంది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచేస్తుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కర్ణ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Month of Madhu Trailer Unveiled by Supreme Hero Sai Dharam Tej
ట్రైలర్ & టీజర్

మంత్ ఆఫ్ మధు ట్రైలర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్

'అందాల రాక్షసి' ఫేమ్ నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. క్రియేటివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందించారు. లవ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమయింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ప్రారంభించింది. దీనిలో…

Srikanth Mవాట్సాప్
2018 movie selected as indias official entry for oscars
సినిమా వార్తలు

ఆస్కార్ ఎంట్రీ కొట్టేసిన బ్లాక్ బస్టర్ 2018

ఒకప్పుడు ఇండియన్ సినిమాలు ఆస్కార్ ఎంట్రీ వరకూ వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇండియన్ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. మన సినిమాలు కూడా ఆస్కార్ బరిలో నిలుస్తున్నాయి. రీసెంట్ గానే సౌత్ సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్ కు తీసుకెళ్లింది ఆర్ఆర్ఆర్ సినిమా. బాహుబలి తోనే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ ను తీసుకొచ్చాడు.

TFN Adminవాట్సాప్
Maama Mascheendra movie trailer out now
ట్రైలర్ & టీజర్

మామ మశ్చీంద్ర ట్రైలర్ రిలీజ్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ జయాపజయాలను పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నైట్రో స్టార్ సుధీర్ బాబు. ప్రస్తుతం డిఫరెంట్ కథతో వస్తున్నాడు. హర్షవర్థన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు గెటప్స్ తో అలరించనున్నాడు. దుర్గ అనే పాత్రలో, గ్యాంగ్ స్టర్ లా ఉండే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేసే పనిలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
harish shankar crazy update on Ustaad Bhagat Singh Movie
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ తో ఈసారి హిస్టరీ రిపీట్ చేద్దాం

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాను ప్రకటించిన తరువాత సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ స్వాగ్, డైలాగ్, లుక్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Rajamouli Completes 22 Glorious Years in the Film Industry
సినిమా వార్తలు

రాజమౌళి సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు పూర్తి.. స్పెషల్ స్టోరీ

ఎస్ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు. దేశంలో ఆయన మేకింగ్ స్టైల్, విజన్‌కి సరితూగే దర్శకులే లేరంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి ఇప్పటివరకూ తీసిన ప్రతి సినిమా హిట్టే.. కెరీర్‌లో ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదంటే ఆయన కెపాసిటీ ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని, పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అభిమానులే కాదు, సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో రాజమౌళి ఖ్యాతి దేశం ఎల్లలు దాటి…

Srikanth Mవాట్సాప్
vijay devarakonda 13th movie title and first look update
ఫస్ట్ లుక్

పొంగల్ రేసులోకి రానున్న రౌడీహీరో

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు తన ఫోకస్ ను కొత్త సినిమాలపై పెట్టాడు. ప్రస్తుతం తను పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్