మంత్ ఆఫ్ మధు ట్రైలర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్

Month of Madhu Trailer Unveiled by Supreme Hero Sai Dharam Tej

‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. క్రియేటివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందించారు. లవ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమయింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ప్రారంభించింది. దీనిలో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ‘మంత్ ఆఫ్ మధు’ యూనిట్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఇక కార్యక్రమంలో భాగంగా ఆయన తన చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “నిర్మాతలు యశ్వంత్, దామ నాకు మంచి స్నేహితులు. శ్రీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘భానుమతి & రామకృష్ణ’ చూశాను. ఇందులో చాలా క్లిష్టమైన భావోద్వేగాలున్నాయి. అలాంటి ఎమోషన్స్ ‘మంత్ ఆఫ్ మధు’లో కూడా కనిపిస్తున్నాయి. నవీన్‌ అన్ని రకాల పాత్రలు చేస్తాడు. అలాగే స్వాతి నాకు చాలా మంచి స్నేహితురాలు. ఎప్పటిలాగే ఇందులోనూ తను అద్భుతంగా కనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్” అని పేర్కొన్నారు.

ఇక హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ”ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ బాగా వచ్చాయి” అని చెప్పారు. అలాగే స్వాతి రెడ్డి మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో నేను, నవీన్‌తో పాటు చాలా మంది మంచి నటీనటులున్నారు. శ్రేయ అద్భుతంగా నటించింది. సినిమా చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు. హర్ష పాత్ర కూడా చాలా బాగుంది. దర్శకుడు శ్రీకాంత్ అద్భుతంగా తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు. దర్శకుడు యశ్వంత్‌ మాట్లాడుతూ.. ”సాయి ధరమ్‌ తేజ్‌కి థాంక్స్‌. ఆయన ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ట్రైలర్ నచ్చినందుకు ఆనందంగా ఉంది. సినిమా మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.

కాగా నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి కలయికలో ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ ‘త్రిపుర’ అనే సినిమాలో కలిసి నటించగా.. ఇది వీరికి మంచి గుర్తింపు తెచ్చింది. శ్రేయ నవిలే కీలకపాత్రలో నటించారు. రాజా రవీంద్ర, మంజుల ఘట్టమనేని, వైవా హర్ష, రాజా చెంబోలు, రుద్ర రాఘవ్, జ్ఞానేశ్వరి, రుచిత సాధినేని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో రాజారవీంద్ర, హర్ష, శ్రేయ, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ ఎలా ఉందంటే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట (రేఖ, మధుసూదన్) మధ్య వచ్చే గొడవల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. మధుసూదన్, రేఖ లవ్ స్టోరీ ఫ్లాష్‍బ్యాక్‍గా చూపించారు. వివాహం తర్వాత మద్యానికి బానిసైన భర్తగా నవీన్ కనిపించగా.. దీని వలన ఇబ్బంది పడే భార్య పాత్రలో స్వాతి రెడ్డి నటించారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐ మధుమతిగా శ్రేయ నవిలే అలరించారు. ఆమె ఇండియన్స్ గురించి తెలుసుకునేందుకు ఒక నెల రోజులపాటు ఇక్కడ ఉండటానికి నిశ్చయించుకుంటుంది. అందుకే ఈ చిత్రానికి మంత్ ఆఫ్ మధు అని పేరు పెట్టినట్టు అర్ధమవుతోంది. ఇక ట్రైలర్‌లో నవీన్ చంద్ర, స్వాతి డైలాగ్స్ చాలా నేచురల్‍గా ఉన్నాయి. అలాగే ట్రైలర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ హృద్యంగా ఉంది. మొత్తంగా ఒక ఎమోషనల్‍ కంటెంట్‌తో ఆకట్టుకునేలా కట్ చేశారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.