ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో ఆడియో లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్, ఎందుకంటే..?

Thalapathy Vijay's Leo Audio Launch Event Cancelled

తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘లియో’. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్‌ ద‌త్ కీల‌క పాత్ర‌లో కనిపించనున్నాడు. అక్టోబ‌ర్ 19న ద‌స‌రా సంద‌ర్భంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ కార్యక్రమాలు ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా సెప్టెంబ‌ర్ 30న చెన్నైలో ‘లియో’ ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేసింది. ఇందుకోసం నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని వేదిక‌గా ఖరారు కూడా చేసింది. ఈ ఈవెంట్‌తోనే సినిమా ప్ర‌మోష‌న్స్ ప్రారంభించాలని మేక‌ర్స్ భావించారు. అయితే తాజాగా ఈ ఈవెంట్‌ క్యాన్సిల్ అయినట్లు నిర్మాత‌లు ప్రకటించారు. డీఎంకే ప్ర‌భుత్వం అనుమ‌తులు నిరాక‌రించ‌డంతోనే ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయిన‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారంపై కూడా వారు క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు దీనిపై నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియో ప్రమోషన్స్ సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఇలా తెలిపింది.. “టిక్కెట్ల కోసం విపరీతమైన డిమాండ్ కారణంగా ఆడియో లాంచ్ రద్దు చేయబడిందని ప్రకటించడానికి చింతిస్తున్నాం. అంద‌రికీ సరిపడా ఎంట్రీ పాస్‌లు అందించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అభిమానుల భ‌ద్ర‌త దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని దళపతి విజ‌య్ అభిమానులు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాం. రాజ‌కీయప‌ర‌మైన ఒత్తిడుల వ‌ల్లే ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్న‌ట్లు చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇది కేవలం అపోహ‌ మాత్రమే. ఆ వార్త‌ల్లో ఎటువంటి వాస్తవం లేదు” అని పేర్కొంది.

ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు డీఎంకే ప్ర‌భుత్వం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆడియో లాంఛ్ ఈవెంట్ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తుల‌ను నిరాక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కోలీవుడ్ హీరో, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్స్ సంస్థ ‘లియో’ సినిమా చెన్నై థియేట్రిక‌ల్ రైట్స్ హ‌క్కుల కోసం పోటీప‌డిందని స‌మాచారం. అయితే ప్రొడ్యూస‌ర్ మాత్రం భారీ ధరకు మ‌రో డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు ‘లియో’ రైట్స్‌ను విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు డీఎంకే ప్ర‌భుత్వం అనుమ‌తులు నిరాక‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ నిర్మాణ సంస్థ వీటిని వదంతులుగా కొట్టిపడేసింది. ‘మాస్ట‌ర్’ సినిమా త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్, లోకేష్ కనగరాజ్ కలిసి చేస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.