ఉస్తాద్ భగత్ సింగ్ తో ఈసారి హిస్టరీ రిపీట్ చేద్దాం

harish shankar crazy update on Ustaad Bhagat Singh Movie

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాను ప్రకటించిన తరువాత సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ స్వాగ్, డైలాగ్, లుక్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా గురించి సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు హరీష్ శంకర్ అప్ డేట్లు ఇస్తూనే ఉంటాడన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈసినిమాపై ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తూనే ఉంటాడు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా గురించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన సతీష్ ఈసినిమా గురించి తన ట్విట్టర్ ద్వారా ప్రీ ఇంటర్వెల్ షూట్ ను చిత్రీకరిస్తున్నామని.. అప్పుడే అయిపోయింది అనుకోకు.. ఇప్పుడే మొదలైంది అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కు హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ.. అవును మనం కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాం.. హిస్టరీ రిపీట్ చేద్దాం అంటూ తెలిపాడు.

కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =