ఒకప్పుడు ఇండియన్ సినిమాలు ఆస్కార్ ఎంట్రీ వరకూ వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇండియన్ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. మన సినిమాలు కూడా ఆస్కార్ బరిలో నిలుస్తున్నాయి. రీసెంట్ గానే సౌత్ సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్ కు తీసుకెళ్లింది ఆర్ఆర్ఆర్ సినిమా. బాహుబలి తోనే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ ను తీసుకొచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సౌత్ సినిమా ఆస్కార్ ఎంట్రీీ కొట్టేసింది. ఆసినిమా మరేదో కాదు.. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన 2018 మూవీ. జూడ్ అంథాని జోసెఫ్ దర్శకత్వంలో టొవీనో థామస్ ప్రధాన పాత్రలో వచ్చింది ఈసినిమా. కేరళ లో వచ్చిన భారీ వరదల నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించగా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏడాది ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరిలో పలు దేశాల నుండి సినిమాలు పంపిస్తాయి. ఈ నేపథ్యంలో పలు సినిమాలను చూసిన ఆస్కార్ కమిటీ ఫైనల్ గా 2018 సినిమాను ఎంపిక చేసింది. దీంతో భారత్ తరుపున ఆస్కార్ రేసులో నిలిచింది ఈసినిమా. ఆ విషయాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధికారికంగా ప్రకటించింది. మరి నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటేనే అవార్డుకు ఆర్హత సాధిస్తుంది.
😍🤩🙏🏼❤️ #2018Movie – India’s Official entry to Oscars! pic.twitter.com/WTnBfWRhPv
— Tovino Thomas (@ttovino) September 27, 2023
కాగా ఇంకా ఈసినిమాలో అపర్ణ బాలమురళి,అసిఫ్ అలీ,లాల్,వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నోబిన్ పౌల్ సంగీతం అందించిన ఈసినిమాకుసినిమాటోగ్రఫీ అఖిల్ జార్జ్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: