సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే టాక్ వుంది.గత కొన్ని సంవత్సరాల నుండి క్వాలిటీ కంటెంట్ వున్న సినిమాలను అందిస్తూ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.ఇక ఈ బ్యానర్ నుండి వస్తున్న మీడియం బడ్జెట్ మూవీ మ్యాడ్.ఈసినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్,యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్,రామ్ నితిన్ హీరోలుగా నటించగా గౌరీ ప్రియా రెడ్డి,అనంతిక,గోపికా ఉద్యాన్ హీరోయిన్లు.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.ఈసినిమాను మొదట ఈనెల 28న విడుదలచేయాలనుకున్నారు కానీ అదే రోజు స్కంద,చంద్రముఖి 2 తరువాతి రోజు పెదకాపు పార్ట్ 1 విడుదలవుతుండడంతో వెనక్కి వెళ్ళిపోయింది.అక్టోబర్ 6నమ్యాడ్ థియేటర్లోకి వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఈవెంట్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతుండగా నాగవంశీ,అనుదీప్ ను జాతి రత్నాలు నచ్చిందా లేక మ్యాడ్ నచ్చిందా అని అడిగాడు దానికి అనుదీప్ మ్యాడ్ అని సమాధానం ఇచ్చాడు.ఈసందర్భంలో మ్యాడ్ చూసి జాతిరత్నాలు కన్నా కొంచెం తక్కువగా నవ్వినా వారికి టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తానని నాగవంశీ ఆఫర్ ఇచ్చాడు.సో సినిమా మీద నాగవంశీ ఎంత కాన్ఫిడెంట్ గా వున్నాడో అర్ధమవుతుంది.మరి ఈసినిమా ఎంత వరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా హారిక సూర్యదేవర,సాయి సౌజన్య నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: