మామ మశ్చీంద్ర ట్రైలర్ రిలీజ్

Maama Mascheendra movie trailer out now

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ జయాపజయాలను పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నైట్రో స్టార్ సుధీర్ బాబు. ప్రస్తుతం డిఫరెంట్ కథతో వస్తున్నాడు. హర్షవర్థన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు గెటప్స్ తో అలరించనున్నాడు. దుర్గ అనే పాత్రలో, గ్యాంగ్ స్టర్ లా ఉండే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేసే పనిలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పోస్టర్లు ఇంకా టీజర్ ను కూాడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలరో మూడు గెటప్స్ లో సుధీర్ బాబు అలరించాడు. దేనికదే డిఫరెంట్ మ్యానరిజమ్స్ తో ఆకట్టుకున్నాయి. అలానే పలు థ్రిల్లింగ్ ఆంశాలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది.. సినిమా ఎలా ఉంటుందో చూాడాలి.

ఈసినిమాలో ఈషా రెబ్బా, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చీ కిరణ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =