టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ విజయం సాధించగా.. ‘ఖలేజా” ఆకట్టుకోలేకపోయింది. ఇక వీరి కలయికలో ‘గుంటూరు కారం’ మూడో సినిమాగా వస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం, అలాగే మహేశ్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో ‘గుంటూరు కారం’పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దీంతో మూవీకి సంబంధించిన అప్‍డేట్స్ కోసం వారు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్‍డేట్ వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంగళవారం హైదరాబాద్ లో ‘మ్యాడ్’ సినిమా ‘క్యారక్టర్ ఇంట్రడక్షన్ ఈవెంట్’లో నాగవంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘గుంటూరు కారం’ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై నాగవంశీ స్పందిస్తూ.. “ఈ విషయమై ఇంకా డేట్ ఏమీ అనుకోలేదు. అయితే దసరా ముందే ఫస్ట్ సింగిల్ గురించి అప్‍డేట్ వెల్లడిస్తాం” అని స్పష్టం చేశారు. అలాగే అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాల రేంజ్‌లో గుంటూరు కారం కలెక్షన్లు ఉంటాయని ఆయన గతంలో చెప్పిన మాటను జర్నలిస్టులు గుర్తు చేయగా.. ఇప్పటికీ తాను ఆ మాటకు కట్టుబడి ఉన్నానని మరోసారి తేల్చి చెప్పారు. దీనిపై ఎలాంటి అనుమానం అక్కరలేదని, వచ్చే జనవరి 12న థియేటర్లలో చూశాక అదేరోజు సాయంత్రం మీరే ఈ మాట ఒప్పుకుంటారని కూడా నాగవంశీ అన్నారు.
ఇక హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న పాన్-వరల్డ్ మూవీలో నటించనున్నారు. ఆఫ్రికా అడవులలో నిధి అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: