అభిమాని ఇంటికి హీరో సూర్య.. ఎందుకంటే?

Suriya Visited Fan's House and Offered Condolences

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గొప్ప మనసు చాటుకున్నారు. తన అభిమాని ఇంటికి వెళ్లిన ఆయన వారి కుటుంబాన్ని పరామర్శించారు. అసలేమైందంటే..? ఇటీవల సూర్య అభిమాని ఒకరు మరణించారు. అరవింద్ అనే అభిమాని సూర్య ఫ్యాన్స్ క్లబ్ సభ్యుడు కూడా. అయితే ఇటీవలే ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అరవింద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలియగానే.. హీరో సూర్య, అరవింద్ కుటుంబాన్ని కలుసుకోవడానికి గురువారం ఎన్నూర్‌లోని అతని ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అరవింద్ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అంత పెద్ద హీరో తమ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు ఒక్కసారిగా ఆశ్చర్య చకితులయ్యారు. కుమారుడి మృతికి సంతాపం తెలిపేందుకు సూర్య స్వయంగా తమ ఇంటికి రావడంతో అరవింద్ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. అయితే సూర్య వారిని ఓదార్చి, ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమాని విషయంలో సూర్య చూపిన ఔదార్యాన్ని ప్రశంసిస్తూ.. ఆయన నిజమైన హీరో అని, ఈరోజు తన చర్య ద్వారా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారని పలువురు నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా సూర్య ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘అగరం ఫౌండేషన్’ అనే ట్రస్ట్ ద్వారా ఎంతోమంది అనాథ పిల్లలను ఆయన చదివిస్తున్నారు. ఇక సూర్య ప్రస్తుతం ‘కంగువ’ అనే వైవిధ్యభరిత చిత్రంలో నటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 14 =