టాలీవుడ్ లో ఎంతో మంది డైరెక్టర్లు ఉండగా ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి స్టైల్ లో వారు సినిమాలు తీస్తుంటారు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఉంటాయి తన సినిమాల్లోని డైలాగ్స్. అందుకే పూరీకి మాత్రం సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. అంతేకాదు హీరో, హీరోయిన్లను ఎలా చూపించాలో పూరీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తన సినిమాలతో ఎంతోమంది హీరోలకు ఎన్నో సూపర్ హిట్లను అందించాడు. ఈమధ్య అంటే కాంపిటీషన్ కాస్త ఎక్కువవ్వడంతో కొంచం స్లో అయ్యాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా డబుల్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుది. ఇక నేడు పూరీ పుట్టిన రోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్ అందించారు. మాస్ ను తన సొంత స్టైల్ లో రీ డిఫైన్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు బ్లాక్ బస్టర్ బర్త్ డే అంటూ తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
To the craftsman who redefined MASS CINEMA in his own style💥
Team #DoubleISMART wishes Our Sensational Director #PuriJagannadh a Blockbuster Birthday 🔥#HBDPuriJagannadh ❤️🔥
Ustaad @ramsayz @duttsanjay @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/cb9RgKXawH
— Puri Connects (@PuriConnects) September 28, 2023
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























