భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి ‘ధోనీ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యానర్ నుంచి నిర్మించిన తొలి సినిమా ‘ఎల్‌జీఎం’. ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ అనేది ఉప శీర్షిక. తమిళంలో రూపొందిన ఈ సినిమా డబ్బింగ్ చేసుకుని పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయింది. కాగా ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం సినిమా రంగంలోకి ఎంటర్ అవుతూ ఫస్ట్ టైమ్ ప్రొడ్యూస్ చేసిన మూవీ కావడంతో.. మొదటినుంచీ ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్ హీరోగా, ‘లవ్‌టుడే’ ఫేమ్ ఇవానా కథానాయికగా నటించగా.. సీనియర్ నటి నదియా, స్టార్ కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం తొలుత తమిళంలో జూలై 28న రిలీజైన తెలుగులో ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బావుందని టాక్ వచ్చినప్పటికీ మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఇక థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత తాజాగా ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకుంది. ఈ క్రమంలో ‘ఎల్‌జీఎం’ మూవీ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి తమిళ్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందో అమెజాన్ ప్రైమ్ ప్రకటించాల్సి ఉంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఎల్‌జీఎమ్ సినిమాకు రమేష్ తమిళమణి దర్శకత్వం వహించాడు.
‘ఎల్‌జీఎం’ మూవీ కథ ఏంటంటే..?
గౌతమ్ (హరీష్ కళ్యాణ్) మీరా(ఇవానా) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు కూడా. అయితే వివాహం తర్వాత.. తల్లి (నదియా), మరియు భార్య ఇద్దరితో కలిసి ఉండాలని గౌతమ్ కోరుకుంటాడు. కానీ నేటితరం భావాలున్న మీరాకు అత్తతో కలిసి ఉండటం ఇష్టం ఉండదు. ఈ పరిస్థితుల్లో మీరాకు, తన తల్లికి మధ్య బాండింగ్ ఏర్పడేందుకు కూర్గ్ ట్రిప్ ప్లాన్ వేస్తాడు గౌతమ్. మీరా కూడా అందుకు అంగీకరిస్తుంది. ఎందుకంటే..? ఆమె పెళ్లికి ముందే తనకు కాబోయే అత్తగారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే ఆ ట్రిప్‌లో వీరి మధ్య ఏం జరిగింది? తల్లికి, కాబోయే భార్యకు మధ్య గౌతమ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? కూర్గ్ ట్రిప్ నుంచి మీరాతో పాటు గౌతమ్ తల్లి గోవా ఎందుకు వెళ్లారు? ప్రమాదంలో చిక్కుకున్న వారిని గౌతమ్ ఎలా కాపాడాడు? అన్నదే ఈసినిమా కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: