బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తున్న సినిమా స్కంద. మాస్ సినిమాలు తీయడంలో బోయపాటి దిట్ట.. అలాంటి బోయపాటి డైరెక్షన్ లో రామ్ హీరోగా ఈసినిమా వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా సెప్టెంబర్28వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాపై రోజు రోజుకూ ఆసక్తి పెరగుతుంది. దీనికి ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్సే నిదర్శనమని చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి ట్రైలర్ అయితే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. యూట్యూబ్ లో అన్ని భాషల్లో కలిపి ట్రైలర్ 50మిలియన్స్ కు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బుక్ మై షోలో కూడా ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈసినిమా బుక్ మై షోలో 100కే ఇంట్రెస్ట్స్ పెరగగా.. తాజాగా ఈ సినిమా 200కే ఇంట్రెస్ట్స్ ను సొంతం చేసుకుంది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందేమో చూద్దాం..
Excitement and anticipation reach new heights as #Skanda arriving tomorrow ❤️🔥💥
Massive 200K+ Interests on @bookmyshow 🔥🔥
Book 🎟- https://t.co/2KCFrBB4FR#RAmPOthineni #SkandaOnSep28
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl… pic.twitter.com/li5PMauwJA
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 27, 2023
కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: