అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ల తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఈసినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజెన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతున్నట్టు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. రేపు సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఈసినిమా నుండి స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The journey of #BhagavanthKesari with #NandamuriBalakrishna garu and the entire team was intense and memorable for me personally & professionally❤️
Sharing a special surprise video for all of you tomorrow at 4:05 PM pic.twitter.com/N7vEozbASx
— Anil Ravipudi (@AnilRavipudi) September 27, 2023
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: