ఈగల్ రిలీజ్ డేట్ ఫిక్స్

eagle release date out

వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కోసం స్లాట్స్ బుక్ అవుతున్నాయి.అందులో భాగంగా రవితేజ -కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో వస్తున్న ఈగల్ రిలీజ్ డేట్ ను చెప్పేసారు మేకర్స్.ఈసినిమా జనవరి 13న విడుదలకానుంది.ఈ సందర్భంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.గ్లింప్స్ కూడా అదిరిపోయింది.స్టైలిష్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా నవదీప్,మధుబాల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నగుంటూరు కారం అలాగే విజయ్ దేవరకొండ-పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా విడుదలకానున్నాయి. ఈరెండు సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.విజయ్ 13సినిమా అయితే ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈరోజు ఉదయమే పండుగకు బరిలో దిగుతున్నామని మేకర్స్ ప్రకటించారు.దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు.ఇవే కాకుండా ఇంకా ఒకటి రెండు సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లోకి వచ్చే ఛాన్స్ వుంది.సో ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా ఉండనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.