‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ వైలెంట్ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్ తో చేసిన ‘కబీర్ సింగ్’ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకి చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో ఇక్కడ కూడా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలో నేడు రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా.. మేకర్స్ యానిమల్ సినిమా తెలుగు టీజర్ రిలీజ్ చేశారు.
Animal Teaser || Teluguhttps://t.co/86gtMdlivb@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep @VangaPranay #KrishanKumar @anilandbhanu @VangaPictures @TSeries @rameemusic @cowvala @supremesundar @sureshsrajan
— Bhadrakali Pictures (@VangaPictures) September 28, 2023
టీజర్ ఎలా ఉందంటే..?
అందరూ ఊహించినట్లుగానే సందీప్ రెడ్డి టీజర్‌లో తన స్టైల్ యాక్షన్ ను చూపించాడు. రణబీర్ కపూర్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో, ఇంటెన్స్ లుక్ తో అదరగొట్టాడు. తండ్రి-కొడుకుల సంబంధం చుట్టూ యానిమల్ తిరుగుతుందని తెలుస్తోంది, అండర్‌వరల్డ్‌లో విపరీతమైన రక్తపాతం నేపథ్యంలో కథానాయకుడు సైకోపాత్‌గా మారడానికి దారి తీసిన పరిస్థితులను చూపించింది. రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న టీజర్ రష్మిక మందన్న మరియు రణబీర్ కపూర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. గూంజ్ బంప్స్ తెప్పించేలా ఉన్న ఈ టీజర్‌ను చూస్తుంటే ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: