కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 276

Bhagavanth Kesari Fight Master Venkat Reveals Interesting Facts About Nandamuri Balakrishna
సినిమా వార్తలు

యాక్షన్ సీక్వెన్స్‌లో బాలకృష్ణని బీట్ చేయడం అంటే.. ఫైట్ మాస్టర్ వెంకట్

యాక్షన్ సీక్వెన్స్‌లో నందమూరి బాలకృష్ణని బీట్ చేయడం అంటే.. మామూలు విషయం కాదని పేర్కొన్నారు ప్రముఖ ఫైట్ మాస్టర్ వెంకట్. కాగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో 'భగవంత్ కేసరి' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల…

Srikanth Mవాట్సాప్
aadikeshava second single out now
సాంగ్

ఆదికేశవ నుండి సాంగ్ రిలీజ్

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్,సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ.ఈసినిమా నుండి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ,ఫస్ట్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈరోజు ఈసినిమా నుండి సెకండ్ సాంగ్ హే బుజ్జి బంగారం రిలీజ్ చేశారు.మెలోడీ గా వచ్చిన ఈ సాంగ్ కూడా బాగుంది. రామజోగయ్య లిరిక్స్ అందించగా బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ అలాగే యామిని ఘంటసాల పాడారు.

Mahender Reddyవాట్సాప్
amitabh bachchan powerful poster released from kalki 2898 AD
ఫస్ట్ లుక్

కల్కి2898 ఏడీ నుండి బిగ్ బీ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా అంతర్జాతీయ లెవల్లో గుర్తింపును తెచ్చుకుంది.

TFN Adminవాట్సాప్
chiranjeevi birthday wishes to amitabh bachchan
సినిమా వార్తలు

బిగ్ బీ కి మెగాస్టార్ బర్త్ డే విషెస్

నేడు బాలీవుడ్‌ స్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ 81వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్ డే గురూజీ.. మీరు ఎల్లప్పుడూ సంతోషంతో, మంచి ఆరోగ్యంతో ఉండాలని.. మీ నటనతో అనేక సంవత్సరాలపాటు మాఅందరికీ స్పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకమైనది.. మీ కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో ఈ రోజు మిమ్మల్ని కలిసేందుకు నేను ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ లో పోస్ట్‌ చేశారు.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Completes 27 Years in TFI
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 27 ఏళ్ళు.. పవర్ స్టార్‌పై ప్రత్యేక కథనం

పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ఈ పేరు వినపడితే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. థియేటర్ల వద్ద సందడి మాములుగా ఉండదు. టాలీవుడ్ హీరోలలో మరే హీరోకు లేనటువంటి డై హార్డ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సొంతం. ఎవరైనా ఆయనను ఒక్క మాట అన్నా అభిమానులు తట్టుకోలేరు. 'అంతకుమించి' అనే స్థాయిలో రియాక్ట్ అవుతుంటారు. ఇక పవన్ కళ్యాణ్ కు రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ పేరుంది. ఆయన తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్…

Srikanth Mవాట్సాప్
Ram Charan's Game Changer Shooting Latest Update
షూటింగ్ అప్‌డేట్

'గేమ్ ఛేంజర్' షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చ‌ర‌ణ్‌. ఆయన కథానాయకుడిగా ఆర్‌సీ15గా వస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. 'విన‌య‌ విధేయ‌ రామ' త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తోన్న సినిమా కావడం గమనార్హం. ఇక…

Srikanth Mవాట్సాప్
Ammayi Song Released From Animal Movie
సాంగ్

యానిమల్- సూపర్ విజువల్స్ తో అమ్మాయి సాంగ్ రిలీజ్

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Mad Movie 5 Days Collections
బాక్సాఫీస్

క్రేజీ గా మ్యాడ్ సినిమా 5 డేస్ కలెక్షన్స్

ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటాయి కొన్ని సినిమాలు. కంటెంట్ ఉంటే చిన్న సినిమానా లేక పెద్దసినిమానా అని చూడకుండా ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. రీసెంట్ గా రిలీజైన మ్యాడ్ సినిమాకు అలాంటి ఆదరణే లభిస్తుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈసినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన వారందరూ కొత్తవాళ్లే అయినా కూడా అలాంటి ఫీలింగ్ ఎక్కడా లేకుండా అందరూ చాలా ఈజ్…

TFN Adminవాట్సాప్
Vishwaksen's Gangs of Godavari Movie Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. కాగా ఈ ఏడాది సమ్మర్ టైంలో 'దాస్ కా ధమ్కీ' మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు విశ్వక్. అలాగే నేహా శెట్టి నటించిన 'బెదురులంక' మూవీ కూడా ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో విశ్వక్ సేన్, నేహా శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'పై హైప్ క్రియేట్ అయింది. ఇక ఇందులో విశ్వక్ రగ్గడ్ మాస్ లుక్‍తో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
vyjayanthi movies legel notice about jagadeka veerudu athiloka sundari movie
సినిమా వార్తలు

వైజయంతీ మూవీస్ మరో లీగల్ నోటీస్.. జగదేకవీరుడు అతిలోక సుందరి హక్కులు మావే

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించింది వైజయంతీ మూవీస్ సంస్థ వారు. ఆ మధ్య కాస్త డల్ అయినా ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చి సినిమాలను నిర్మిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభాస్ హీరోగా ల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ స్థాయిలో ఈసినిమా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇటీవలే మేకర్స్ ఈసినిమా లీకుల విషయంలో స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఈసినిమా హక్కులన్నీ నిర్మాణ సంస్థకే చెందుతాయి.. ఈ సినిమాలోని ఏదైనా సీన్ కానీ ఫొటో కానీ వీడియోలను సోషల్ మీడియా ద్వారా…

TFN Adminవాట్సాప్
leo movie third single update
సాంగ్

లియో మూడో సాంగ్ అప్ డేట్

ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో లియో ఒకటి. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేయనుండగా తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Dil Raju's Father Passed Away, Ram Charan and Many More Celebrities Pays Condolences
సినిమా వార్తలు

దిల్ రాజుకి పితృ వియోగం.. రామ్‌ చరణ్‌ సహా పలువురు ప్రముఖుల పరామర్శ

టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజుకి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి శ్యామ్‌సుందర్‌ రెడ్డి సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్యామ్‌సుందర్‌ రెడ్డి నిన్న రాత్రి 8 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక దిల్ రాజు ఇంట విషాదం చోటుచేసుకున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు దిల్‌ రాజుని పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వారి ఇంటికి వెళ్లి శ్యామ్‌సుందర్‌ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి దిల్ రాజును ఓదార్చారు.

Srikanth Mవాట్సాప్
nani interesting comments on roshans Bubblegum movie
సినిమా వార్తలు

బబుల్‌గమ్‌ రోషన్ కి బ్లాక్ బస్టర్ స్టార్ట్ అవుతుంది-నాని

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల, పాపులర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్‌ కనకాల బబుల్‌గమ్‌ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక. ఇటీవలే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ కు ముఖ్య అతిధిగా పాల్గొన్న నాని టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Jr NTR and Ram Charan Extends Birthday Wishes to Director SS Rajamouli
సినిమా వార్తలు

రాజమౌళికి బర్త్ డే విషెస్ చెప్పిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్

ఎస్ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఆయన మేకింగ్ స్టైల్, విజన్‌కి సరితూగే దర్శకులే లేరంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి ఇప్పటివరకూ తీసిన ప్రతి సినిమా హిట్టే.. కెరీర్‌లో ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదంటే ఆయన కెపాసిటీ ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని, పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అభిమానులే కాదు, సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో…

Srikanth Mవాట్సాప్
salaar movie team solid reply on fight scene leak
సినిమా వార్తలు

సలార్ ఫైట్ లీక్ పై మేకర్స్ సాలిడ్ రిప్లై

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెద్ద సినిమాలకు లీకుల గోల తప్పట్లేదన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇటీవలే గేమ్ ఛేంజర్ మేకర్స్ అయితే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాకు కూడా లీకుల గోల తప్పట్లేదు. ఈసినిమాకు సంబంధించి కూడా అప్పుడప్పుడు పలు ఫొటోలు బయటకు వస్తూనే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
mad movie 4 days collections
బాక్సాఫీస్

దూసుకుపోతున్న మ్యాడ్ కలెక్షన్స్

కొన్నికొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం చూపిస్తుంటాయి. ఈమధ్య కాలంలో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం బాక్సాఫీస్…

TFN Adminవాట్సాప్
Kamal Haasan begins dubbing for Indian 2 movie
సినిమా వార్తలు

ఇండియన్ 2 డబ్బింగ్ మొదలుపెట్టిన కమల్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
lokesh kanagaraj clarity about khaidi movie sequel
సినిమా వార్తలు

ఖైదీ సీక్వెల్ పై లోకేష్ మరోసారి క్లారిటీ

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా తెరకెక్కిన ఈసినిమా 2019 దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Bubblegum Teaser Out Now
ట్రైలర్ & టీజర్

బబుల్ గమ్ టీజర్ రిలీజ్

సుమ-రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం బబుల్ గమ్.క్షణం,కృష్ణ అండ్ హిజ్ లీల లతో హిట్లు కొట్టిన దర్శకుడు రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైయింది.యూత్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతుంది ఈసినిమా.నాచురల్ స్టార్ నాని ఈ టీజర్ ను లాంచ్ చేశాడు.టీజర్ లో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా టీజర్ అయితే ప్రామిసింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Trivikram Srinivas Completes 21 Years as Director in TFI
సినిమా వార్తలు

దర్శకుడిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్పెషల్ స్టోరీ

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుత టాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్లలో ఒకరు. తొలుత మాటల రచయతగా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా ప్రమోషన్ అందుకున్నారు. మాటల మాంత్రికుడిగా పేరొందిన ఆయన తను పనిచేసిన సినిమాల్లో కావొచ్చు.. తాను తీసిన చిత్రాల్లో కావొచ్చు.. మాటల్లో మ్యాజిక్, డైలాగ్స్‌లో పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కాగా తెలుగు ఇండస్ట్రీలో మాటల రచయితగా మొదలుపెట్టి అగ్ర దర్శకుల రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుడు ఇటీవలికాలంలో ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే. ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ…

Srikanth Mవాట్సాప్

షేర్