కొన్నికొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం చూపిస్తుంటాయి. ఈమధ్య కాలంలో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు రోజుకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఈసినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు అవ్వగా ఈ నాలుగు రోజుల్లో 10 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరి ఒక చిన్న సినిమా నాలుగు రోజుల్లో 10 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిందంటే మాములు విషయం కాదు. ఈవారం రిలీజ్ కు సినిమాలు కూడా పెద్దగా లేవు కాబట్టి ఈ వారంతో పాటు వచ్చేవారం కూడా కలిసొస్తుంది.
A MAD Hold on weekdays at the Box-office ~ Day 4 = Day 1🔥 #MAD Entertainer of the year Grosses over 𝟏𝟎.𝟐 𝐂𝐑 in 4 Days! 🥳🕺
Book your tickets now 🎟 – https://t.co/IrUWNwCYws@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/rzdke8XYLs
— Sithara Entertainments (@SitharaEnts) October 10, 2023
కాగా ఈసినిమాలో గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లుగా నటించగా.. మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు తదితరులు పలు కీలకపాత్రల్లో నటించారు. సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర హారిక నిర్మించిన ఈసినిమాకు సంగీతం.. భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫి..దినేష్ కృష్ణన్, శ్యామ్ దత్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: