రాజమౌళికి బర్త్ డే విషెస్ చెప్పిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్

Jr NTR and Ram Charan Extends Birthday Wishes to Director SS Rajamouli

ఎస్ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఆయన మేకింగ్ స్టైల్, విజన్‌కి సరితూగే దర్శకులే లేరంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి ఇప్పటివరకూ తీసిన ప్రతి సినిమా హిట్టే.. కెరీర్‌లో ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదంటే ఆయన కెపాసిటీ ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని, పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అభిమానులే కాదు, సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి ఖ్యాతి దేశం ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తం అయింది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశం ఖ్యాతిని కూడా ఆస్కార్ వేదికపై ఘనంగా చాటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈరోజు (అక్టోబర్ 10, 2023) రాజమౌళి జన్మదినం. ఈ సందర్భంగా రాజమౌళికి టాలీవుడ్ స్టార్ హీరోలు, ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నటులు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ స్పెషల్ విషెస్ చెప్పారు. అయితే ఈ ఇద్దరి హీరోలతో రాజమౌళికి ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాజమౌళి జన్మదినం సందర్భంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ సోషల్ మీడియాలో.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సెట్స్ నుండి రాజమౌళితో కలిసి ఉన్న చిత్రాలను షేర్ చేశారు. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తెలిపారు. అలాగే జూ.ఎన్టీఆర్ కూడా తన ఎక్స్ ద్వారా.. ‘మావెరిక్ డైరెక్టర్‌కి జన్మదిన శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twelve =