లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా డబ్బింగ్ ప్రోగెస్ జరుగుతుందని తెలుపుతూ ఒక వీడియోను సైతం పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కమల్, డైరెక్టర్ శంకర్ ఉండగా.. కమల్ డబ్బింగ్ చెబుతుంటే శంకర్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. మొత్తానికి డబ్బింగ్ లో కూడా శంకర్ దగ్గరుండి మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Exclusive glimpse of INDIAN-2 dubbing session🎙️
Ulaganayagan @ikamalhaasan begins voicing his character 🤗
Directed by @shankarshanmugh 🎬
Dubbing currently in progress ███░░#Indian2 🇮🇳 @anirudhofficial @dop_ravivarman @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/PvsTB2z7A1
— BA Raju’s Team (@baraju_SuperHit) October 9, 2023
కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: