యాక్షన్ సీక్వెన్స్‌లో బాలకృష్ణని బీట్ చేయడం అంటే.. ఫైట్ మాస్టర్ వెంకట్

Bhagavanth Kesari Fight Master Venkat Reveals Interesting Facts About Nandamuri Balakrishna

యాక్షన్ సీక్వెన్స్‌లో నందమూరి బాలకృష్ణని బీట్ చేయడం అంటే.. మామూలు విషయం కాదని పేర్కొన్నారు ప్రముఖ ఫైట్ మాస్టర్ వెంకట్. కాగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ‘భగవంత్ కేసరి’ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఫైట్ మాస్టర్ వెంకట్ విలేకరుల సమావేశంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ టాలీవుడ్ స్టార్ హీరోపై ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘భగవంత్ కేసరి’ విశేషాలు ఫైట్ మాస్టర్ వెంకట్ మాటల్లో..

  • ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ గారి యాక్షన్ స్టైల్ సరికొత్తగా వుంటుంది.
  • బాలకృష్ణ గారి సినిమాలకి యాక్షన్ కంపోజ్ చేయడం మామూలు విషయం కాదు.
  • దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కథని రాయడం మొదలుపెట్టినప్పుడే బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలని అనుకున్నారు.
  • భగవంత్ కేసరి ఫస్ట్ హాఫ్‌లో ఒక స్టైల్ యాక్షన్, సెకండ్ హాఫ్‌లో మరో స్టైల్ యాక్షన్ వుంటుంది.
  • బాలకృష్ణ గారి స్పీడ్‌ని పట్టుకొని హాలీవుడ్ స్టైల్‌లో చాలా నేచురల్‌గా యాక్షన్‌ని డిజైన్ చేయడం జరిగింది.
  • యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య బాబు గారి కష్టం కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ కట్స్‌ని ప్లాన్ చేసుకోలేదు.
  • స్లో మోషన్ షాట్‌లను తగ్గించేశాం. 24 ఫ్రేమ్స్‌లో ఆయన యాక్షన్ చేస్తే ఎలా వుంటుందో దాన్నే చేశాం.
  • బాలకృష్ణ గారి ప్రతి సినిమాలో ఒక ప్రత్యేక ఆయుధం వుంటుంది. ఇక ఇందులో ఉన్న ఆయుధం ఆలోచన డైరెక్టర్ అనిల్ గారిదే.
  • కథ, పాత్ర రాసుకున్నపుడే ఆ వెపన్ గురించి వుంది. బాలకృష్ణ కథాపరంగా ఫ్యాక్టరీలో పని చేస్తారు.
  • దీని కోసం చాలా అద్భుతమైన సెట్ చేశారు. అక్కడ ఉన్న వాటితోనే ఒక ఆయుధం తయారు చేస్తారు.
  • ఆ ఎపిసోడ్ టెర్రిఫిక్‌గా వచ్చింది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో వుంటుంది.
  • బాలకృష్ణ గారితో నేను ఇంతకుముందు చేసిన ‘పైసా వసూల్’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల అనుభవం దీనికి కలిసొచ్చింది.
  • అలాగే బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ మీద పట్టు దొరికింది. ఆయన వేగాన్ని అర్ధం చేసుకోగలిగాం.
  • ఆయనకి ఎలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ సెట్ అవుతాయో ఒక అవగాహన వచ్చింది. అవన్నీ ‘భగవంత్ కేసరి’కి ప్లస్ అయ్యాయి.
  • అలాగే ఈ సినిమా యాక్షన్‌లో ఎడిటింగ్ ప్యాట్రన్ కూడా కొత్తగా వుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లు క్రిస్ప్‌గా, ఇంపాక్ట్ ఫుల్‌గా వుంటాయి.
  • ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో ఇంటెన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ వుంటుంది.
  • బాలకృష్ణ, అర్జున్ రామ్ పాల్ మధ్య వచ్చే ఈ యాక్షన్ సీన్.. టగ్ ఆఫ్ వార్ గా వుంటుంది.
  • యాక్షన్ సీక్వెన్స్‌లో బాలకృష్ణ గారిని బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
  • కానీ ఇందులో మాత్రం మొదట అర్జున్ రాంపాల్ టేకోవర్ చేస్తారు.
  • బాలకృష్ణ గారు ఫైటర్స్‌ని కూడా నేరుగా కొట్టమనేవారు. ఈ టగ్ ఆఫ్ వార్ వలన ఫైట్ పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యింది.
  • షైన్ స్క్రీన్స్ నిర్మాతలైన హరీష్ గారు, సాహు గారు మాపైన పూర్తి నమ్మకం ఉంచారు.
  • ఈ సినిమాలో ఏడు అద్భుతమైన సెట్స్ వున్నాయి, అలాగే ఇందులో. దాదాపు ఎనిమిది యాక్షన్ సీక్వెన్సెస్ వుంటాయి.
  • ఎక్కడా రాజీపడకుండా ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌కి సెట్ వేశాం. నిర్మాతలు సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారు.
  • అయితే స్టార్ హీరోస్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నపుడు అన్ని జాగ్తతలు తీసుకుంటాం.
  • బాలకృష్ణ గారు ఆయన కెరీర్‌లో చేయని యాక్షన్స్ సీక్వెన్స్ అంటూ లేదు.
  • మళ్ళీ వాటిని కొత్తగా ప్రజెంట్ చేయడం సవాల్ తో కూడుకున్న విషయం.
  • దానిపై జాగ్రత్తలు తీసుకోని, ఆయన బాడీ లాంగ్వేజ్, కథ, సిట్యువేషన్, లొకేషన్‌కి తగ్గట్టుగా సరికొత్తగా ప్రజెంట్ చేశాం.
  • ఇక ప్రస్తుతం నేను కొత్తగా ‘నా సామిరంగా’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలకు పనిచేస్తున్నాను.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.