క్రేజీ గా మ్యాడ్ సినిమా 5 డేస్ కలెక్షన్స్

Mad Movie 5 Days Collections

ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటాయి కొన్ని సినిమాలు. కంటెంట్ ఉంటే చిన్న సినిమానా లేక పెద్దసినిమానా అని చూడకుండా ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. రీసెంట్ గా రిలీజైన మ్యాడ్ సినిమాకు అలాంటి ఆదరణే లభిస్తుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈసినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన వారందరూ కొత్తవాళ్లే అయినా కూడా అలాంటి ఫీలింగ్ ఎక్కడా లేకుండా అందరూ చాలా ఈజ్ తో నటించి మెప్పించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈసినిమా అదే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజు కూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ వెళుతుంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో ఈసినిమా 10 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకోగా తాజాగా అయిదో రోజు కలెక్షన్స్ ను కూడా పంచుకున్నారు మేకర్స్. ఐదు రోజుల్లో ఈసినిమా 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అక్టోబర్ 19 వరకూ పెద్దగా సినిమాలు లేవు.. దీంతో ఇది ఈసినిమాకు బాగా కలిసొచ్చే అవకాశం. మరి ముందు ముందు ఈసినిమా ఇంకా కలెక్షన్స్ ను పెంచుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు…

కాగా ఈసినిమాలో గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లుగా నటించగా.. మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు తదితరులు పలు కీలకపాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక, హాసిని ఫిలింస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై హారిక సూర్య దేవర తొలిసారి నిర్మాతగా, ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ సమర్పకుడిగా ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు సంగీతం.. భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫి..దినేష్ కృష్ణన్, శ్యామ్ దత్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.