ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా అంతర్జాతీయ లెవల్లో గుర్తింపును తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే నేడు అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి బిగ్ బీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సాధువు గెటప్ లో ఉన్న అమితాబ్ లుక్ పవర్ ఫుల్ గా ఉంది.
It’s an honor to be part of your journey and witness your greatness. Happy Birthday @SrBachchan sir 🙏
– Team #Kalki2898AD pic.twitter.com/pU7sFWheGy
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 11, 2023
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: