తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించింది వైజయంతీ మూవీస్ సంస్థ వారు. ఆ మధ్య కాస్త డల్ అయినా ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చి సినిమాలను నిర్మిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభాస్ హీరోగా ల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ స్థాయిలో ఈసినిమా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇటీవలే మేకర్స్ ఈసినిమా లీకుల విషయంలో స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఈసినిమా హక్కులన్నీ నిర్మాణ సంస్థకే చెందుతాయి.. ఈ సినిమాలోని ఏదైనా సీన్ కానీ ఫొటో కానీ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం చట్ట విరుద్ధం. అలా పంచుకుంటే కాపీ రైట్ యాక్ట్ కింద శిక్ష కూడా పడుతుంది అంటూ నోట్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో లీగల్ నోటీసును ఇచ్చారు మేకర్స్. అయితే ఇది కల్కి సినిమాకు కాదులెండీ. వైజయంతీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా గురించి. ఈ సినిమా విషయంలో లీగల్ నోటీసు ఇచ్చారు. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా లాంటి నేపథ్యంలోనే కొత్త సినిమా ఒకటి రాబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందుగానే వైజయంతీ మేకర్స్ వారు స్పందిస్తూ ఒక లీగల్ నోటీస్ ను వదిలారు. అందులో ఈసినిమాకు సంబంధించిన స్టోరీ, సాంగ్స్ క్యారెక్టర్స్ తోపాటు మూవీ సీక్వెల్, ప్రీక్వెల్, వెబ్ సిరీస్ ఇతర ప్రసార చిత్రాల్లో ఎక్కడా వాడకూడదు. సంస్థ అనుమతి లేకుండా ఎలాంటి కంటెంట్ వాడినా కాపీ రైట్స్ కింద చట్టపరమైన చర్యలు సివిల్ కేసులు ఎదుర్కోవాల్సివస్తుంది అని నోట్ లో పేర్కొన్నారు.
Unauthorized use of our film #JagadekaVeeruduAthilokaSundari and its content will result in legal action. pic.twitter.com/0Kv19RpoBJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 10, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: