దర్శకుడిగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్పెషల్ స్టోరీ

Trivikram Srinivas Completes 21 Years as Director in TFI

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుత టాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్లలో ఒకరు. తొలుత మాటల రచయతగా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా ప్రమోషన్ అందుకున్నారు. మాటల మాంత్రికుడిగా పేరొందిన ఆయన తను పనిచేసిన సినిమాల్లో కావొచ్చు.. తాను తీసిన చిత్రాల్లో కావొచ్చు.. మాటల్లో మ్యాజిక్, డైలాగ్స్‌లో పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కాగా తెలుగు ఇండస్ట్రీలో మాటల రచయితగా మొదలుపెట్టి అగ్ర దర్శకుల రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుడు ఇటీవలికాలంలో ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే. ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై స్పెషల్ స్టోరీ..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ. ఆయన కలం పేరు ‘త్రివిక్రమ్’. దీనినే తన పేరుకి ముందు చేర్చుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్‌గా పాపులర్ అయ్యారు. 1972 నవంబర్ 7 న జన్మించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలపై ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో అనేక చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో 1999లో ‘స్వయంవరం’ సినిమాతో మాటల రచయతగా అవకాశం దక్కించుకున్న ఆయన అక్కడినుంచి తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయతగా గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ సినిమాల ద్వారానే. కాంబినేషన్‌లో వచ్చిన ‘స్వయంవరం’, ‘నువ్వే కావాలి’, ‘చిరునవ్వుతో’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’, ‘జై చిరంజీవా’ తదితర సినిమాలలో తన పెన్ పవర్ ఏంటో చూపించారు.

జనబాహుళ్యంలో విరివిగా ఉపయోగించే సాధారణ పదాలనే సినిమాల్లోని పాత్రల ద్వారా చెప్పించి క్లాప్స్ కొట్టేలా చేశారు. అప్పటివరకూ మాములుగా తెలుగు చిత్రాల్లో హీరో పాత్రధారిపై జోక్స్ వేయడం అనేది అంతగా ఉండేది కాదు. కానీ, త్రివిక్రమ్ దీనిని బ్రేక్ చేశారు. పక్కనున్న క్యారక్టర్లతో హీరోలపై కూడా జోక్స్ పేలుస్తూ మంచి కామెడీని సృష్టించేవారు. ఇది అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సినిమాల్లో కామెడీకి కేరాఫ్ అడ్రెస్ లెజెండరీ డైరెక్టర్ జంధ్యాల గారు. ఆయన సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయన తర్వాత రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ వంటి పలువురు దర్శకులు ఆ తరహా చిత్రాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీరందరినీ మించి హీరోల మాదిరి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈ నేపథ్యంలో తరుణ్‌ హీరోగా ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగా తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న త్రివిక్రమ్.. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో ప్రారంభమైన త్రివిక్రమ్ ప్రస్థానం.. నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఈ క్రమంలో ఆయన టాలీవుడ్ లోని అగ్రదర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఇక 2002 అక్టోబర్ 10న విడుదలైన ‘నువ్వే నువ్వే’ సినిమా ఆ ఏడాది ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డు అందుకోవడం విశేషం. ఇక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు ధరించారు.

దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలను తెరకెక్కించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాను, నితిన్ హీరోగా ‘అ ఆ’ వంటి సూపర్ హిట్ సినిమాలను తీశారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సాన్నిహత్యం కలిగిన త్రివిక్రమ్ ఆయనతో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు తీశారు. అలాగే పవన్ ఇతర చిత్రాలకూ అప్పుడప్పుడూ రచనా సహకారం, సంభాషణలు అందిస్తుంటారు. పవన్ హీరోగా ఇటీవల వచ్చిన ‘భీమ్లానాయక్’, ‘బ్రో’ వంటి సినిమాలకు త్రివిక్రమ్ రచనా సహకారం అందించారు.

ఇక స్వతహాగా మంచి రచయిత అయిన త్రివిక్రమ్ పాటల్లో సైతం తన ప్రత్యేకతను నిలుపుకుంటారు. ఆయన తన సినిమాల్లోని పాటలు మంచి అర్ధవంతంగా ఉండటంతో పాటు వినసొంపైన సంగీతం ఉండేలా చేసుకుంటుంటారు. దీంతో త్రివిక్రమ్ సినిమాల్లోని అన్ని పాటలు మ్యూజికల్ హిట్ అవుతుంటాయి. కాగా రెండు దశాబ్దాలకు పైబడి కొనసాగుతున్న ఆయన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 2 సైమా అవార్డులు, 3 నంది అవార్డులు సహా మరెన్నో పురస్కారాలను దక్కించుకున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ‘గుంటూరు కారం’ సినిమాను రూపొందిస్తున్నారు. సో.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మున్ముందు మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహించాలని, అవి ఘనవిజయం సాధించాలని, తద్వారా ఆయన ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనసారా కోరుకుంటూ.. తెలుగు ఫిల్మ్ నగర్ తరపున ఆయనకు ఆల్ ది బెస్ట్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =