సలార్ ఫైట్ లీక్ పై మేకర్స్ సాలిడ్ రిప్లై

salaar movie team solid reply on fight scene leak

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెద్ద సినిమాలకు లీకుల గోల తప్పట్లేదన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇటీవలే గేమ్ ఛేంజర్ మేకర్స్ అయితే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాకు కూడా లీకుల గోల తప్పట్లేదు. ఈసినిమాకు సంబంధించి కూడా అప్పుడప్పుడు పలు ఫొటోలు బయటకు వస్తూనే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు లీకుల విషయంలో మరోసారి సలార్ టీమ్ సోషల్ మీడియా వేదికగా సాలిడ్ రిప్లై ఇచ్చింది. తాజాగా ట్విట్టర్ లో సలార్ సినిమా ఫైట్ సీన్ లీక్ అయింది .. ఎవరైనా కావాలంటే రీట్వీట్ చేయండి లేక డైరెక్ట్ గా మెసేజ్ చేయండి అంటూ ట్వీట్ ప్రత్యక్షమైంది. ఇక ఈ ట్వీట్ కాస్త సలార్ మేకర్స్ వరకూ వెళ్లడంతో డైరెక్ట్ గా సలార్ టీమే రంగంలోకి దిగి సాలిడ్ రిప్లై ఇచ్చింది. లీక్ అయిన సీన్ ను మాకు కూడా డీఎమ్ (డైరెక్ట్ మెసేజ్) చేయండి అంటూ రిప్లై ఇచ్చారు. టీమ్ రిప్లై తో ఎలాంటి సీన్ లీక్ అవ్వలేదనే క్లారిటీ అయితే వచ్చేసింది.

కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుండగా రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =