టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. కాగా ఈ ఏడాది సమ్మర్ టైంలో ‘దాస్ కా ధమ్కీ’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు విశ్వక్. అలాగే నేహా శెట్టి నటించిన ‘బెదురులంక’ మూవీ కూడా ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో విశ్వక్ సేన్, నేహా శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై హైప్ క్రియేట్ అయింది. ఇక ఇందులో విశ్వక్ రగ్గడ్ మాస్ లుక్‍తో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ స్పష్టం చేసింది. ఈసారి శివాలెత్తిపోద్దంతే.. అంటూ అందులో విశ్వక్ పేర్కొనడం విశేషం. కాగా హీరో నితిన్ నటించిన ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్’ సినిమా తొలుత అనుకున్నదాని ప్రకారం డిసెంబర్ 23న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో డిసెంబర్ 8వ తేదీన విడుదల చేయడానికి నిర్ణయించారు. దీంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టేలా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 8వ తేదీనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల ఉంటుందని తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘𝐋𝐀𝐍𝐊𝐀𝐋𝐀 𝐑𝐀𝐓𝐍𝐀’
EST since 1994 .
#GangsofGodavari 🌊 from 8th December, 2023! 🔥
E sari sivalethipodhanthe 🔥🙏🎚️In cinemas #GOGonDec8th 🌊 @thisisysr @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri @innamuri8888 @SitharaEnts… pic.twitter.com/9tEDwas9JR
— VishwakSen (@VishwakSenActor) October 10, 2023
కాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకి ‘చల్ మోహన్ రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోదావరి బ్యాక్‍డ్రాప్‍లో ఓ పల్లెటూరి నేపథ్యం కలిగిన కథతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘సుట్టంలా సూసి’ అంటూ సాగే మెలోడియస్ పాట రిలీజై మంచి పాపులర్ అయింది. ఇందులో విశ్వక్ సేన్, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ సూపర్ అని మూవీ లవర్స్ అంటున్నారు. కాగా ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























