టాలీవుడ్ స్టార్ కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తుండగా.. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ స్పై గా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు ‘చారి 111’కి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో వెన్నెల కిశోర్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే… ‘వెన్నెల’ కిశోర్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. హీరోయిన్ సంయుక్తా విశ్వనాథ్ గ్లామర్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. అలాగే ‘చారి 111’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జేమ్స్ బాండ్ కారుతో పాటు వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ వెనుక చూస్తే ఛార్మినార్ కనబడుతోంది. హైదరాబాద్ సిటీ నేపథ్యం కథ అని తెలుస్తోంది. ఇంకా బాంబు బ్లాస్ట్ దృశ్యాలు, స్టైలిష్ కార్ కూడా ఉన్నాయి.
SPY ACTION-COMEDY ‘CHAARI 111’ FIRST LOOK POSTER OUT NOW… Unveiling #FirstLook poster of #Telugu film #Chaari111, a spy action-comedy-entertainer… Stars #VennelaKishore, #MuraliSharma and #SamyukthaViswanathan.
Written and directed by #TGKeerthiKumar and produced by… pic.twitter.com/OUPg7ClNC7
— taran adarsh (@taran_adarsh) November 14, 2023
కాగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ‘చారి 111’లో ఓ సీరియస్ కాన్ ఫ్లిక్ట్ కూడా ఉండబోతుంది. ‘చారి 111’ కాన్సెప్ట్ టీజర్ సినిమా అనౌన్స్ చేసినప్పుడే విడుదల చేశారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం రావడం ఆ కేసును పరిష్కరించడానికి కన్ ఫ్యూజ్డ్ స్పై చారి (వెన్నెల కిశోర్) వస్తారు. ఆ కేసును చారి ఎలా సాల్వ్ చేశాడనేది సినిమాగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా.. వెన్నెల కిశోర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మరియు ‘ఇండియన్ 2’ సినిమాలతో పాటు తేజ సజ్జా నటిస్తోన్న ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియన్ సినిమాల్లో చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో.. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. కరుణాకర్ స్టంట్స్ రూపొందించారు. ఇక అక్షత బి హొసూరు ప్రొడక్షన్ డిజైన్ చేయగా.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్య సహకారం అందించారు. అలాగే సినిమాటోగ్రాఫర్ గా కషిష్ గ్రోవర్.. సంగీత దర్శకుడిగా సైమన్ కె కింగ్ పనిచేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలియజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: