సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం అంటే కామన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే ఎంతో మంది వారసులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక నందమూరి తారకరామారావు వారసత్వంతో కూడా ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. రామారావు తరువాత హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. వీరిద్దరూ అగ్ర కథానాయకులుగా తండ్రి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోలయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించి షూటింగ్ కూడా పూర్తి చేసి మరికొద్ది రోజుల్లో రిలీజ్ కూడా చేయబోతున్నారు. అంతేకాదు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హాస్పిటల్ నేపథ్యంలోనే ఈసినిమా నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఉన్న ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
కాగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతాన్ని సమకూర్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























