యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు.. వరల్డ్‌వైడ్ బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా ‘దేవర’పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘దేవర’ కొత్త షెడ్యూల్ ఇటీవలే గోవాలో ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అక్కడ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అయితే రీసెంట్‌గా దీపావళి పండుగ సందర్భంగా షూటింగ్ కి షార్ట్ గ్యాప్ ఇచ్చిన చిత్రబృందం.. తాజాగా కొత్త షెడ్యూల్ ప్రారంభించింది. ఈ మేరకు దీపావళిని పురస్కరించుకుని స్వల్ప విరామం అనంతరం నేటినుంచి ‘దేవర’ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెడుతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా అంతకుముందు రామోజీ ఫిల్మ్‌సిటీలో కూడా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ సన్నివేశాలతోపాటు, సైఫ్ అలీఖాన్ తో ఫైట్ సీన్స్ తీసినట్లు తెలుస్తోంది. అలాగే శంషాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన షిప్ సెట్‌లో ఇంట్రడక్షన్ సీన్స్, అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించారు.
UPDATE ⚠️
New schedule of #Devara begins from today!🌊#DevaraPart1, All set to hit screens on April 5th, 2024.#JrNTR #KoratalaSiva #TeluguFilmNagar pic.twitter.com/dmZlywXilk— Telugu FilmNagar (@telugufilmnagar) November 14, 2023
ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి పార్టు వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఒక భారీ చిత్రం చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: