అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వస్తున్న సినిమా మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి కంటెంట్ ఒరియెంటెండ్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తు సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే అప్పడప్పడ తాండ్ర అనే పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. తరుణ్ భాస్కర్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన ఈపాట బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియో సాంగ్ మరింత ఆకట్టుకుంటుంది. తరుణ్ భాస్కర్ ఈపాటలో స్టెప్పులు కూడా వేశాడు.
కాగా ఈసినిమాలో ఇంకా నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ పలు కీలక పాత్రల్లో నటించనున్నారు.ఈసినిమాలో ఇంకా నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: